iDreamPost
android-app
ios-app

కామన్ మహిళగా బిగ్ బాస్-7లోకి డ్రైవర్ షర్మిల!

కామన్ మహిళగా బిగ్ బాస్-7లోకి డ్రైవర్ షర్మిల!

బిగ్ బాస్..  ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ షో.. అక్కడ మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఇతర భాషల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి.. సక్సెల్ పుల్ గా కొనసాగుతుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ వంటి పలు భాషల్లో ఇప్పటికే కొన్ని సీజన్లు పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఆరు సీజన్లు పూర్తి చేసుకుని ఏడో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే కోలివుడ్ బిగ్ బాస్-7కి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. కామన్ మ్యాన్ ప్లేస్ లో ఇటీవల వార్తలో నిలిచిన మహిళ డ్రైవర్ షర్మిల వెల్లనున్నట్లు టాక్ వినిపిస్తోంది. కోలివుడ్ లో ఈ షో ఆగష్టు నెలలోనే ప్రారంభం కానుంది.

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన షర్మిల(24) ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అందుకు కారణం కూడా ఓ స్టోరీ ఉంది. ఆమె కోయంబత్తూరు నగరంలోని ప్రైవేటు బస్సులో తొలి మహిళా డ్రైవర్‌గా పని చేసి.. అందరి పొందింది. కానీ ఆమె నడిపిన బస్సులో డీఎంకే ఎంపీ కనిమొళి ప్రయాణించారు. ఆ తరువాత కొన్ని గంటల్లోనే ఆ బస్సు డ్రైవర్‌ ఉద్యోగాన్ని షర్మిల కోల్పోయింది. ఆ యువతి ఉద్యోగంలో ఉన్నప్పుడే  షర్మిల బాగా సెలబ్రటీ అయ్యారు. అలా ఉద్యోగం కోల్పోయిన డ్రైవర్‌ షర్మిలకు కారును బహుమతిగా కమల్ హాసన్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు.

ఇప్పటివరకు ఉద్యోగిగా ఉన్న ఆమె.. ఇకపై ఎంతో మందికి ఉపాధి కల్పించే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇప్పుడు తాజాగా ఆమెకు బిగ్‌బాస్‌-7లోకి ఎంట్రీ దాదాపు ఖాయం అని ప్రచారం జరుగుతుంది. షో ఎంట్రీ వరకు కమల్‌ నుంచి కచ్చితంగా సాయం అందుతుందని టాక్ వినిపిస్తోంది. ఆమె షోలో పాల్గొనాలని తమళనాట సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతుంది.  మరి.. డ్రైవర్ షర్మిల బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బిగ్​బాస్​తో అందర్నీ పిచ్చోళ్లను చేస్తున్నారు.. షోలో డబ్బులిచ్చి హౌస్​లోకి..: సరయు

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş