iDreamPost

బిగ్​బాస్​తో అందర్నీ పిచ్చోళ్లను చేస్తున్నారు.. షోలో డబ్బులిచ్చి హౌస్​లోకి..: సరయు

  • Author singhj Updated - 05:39 PM, Sat - 12 August 23
  • Author singhj Updated - 05:39 PM, Sat - 12 August 23
బిగ్​బాస్​తో అందర్నీ పిచ్చోళ్లను చేస్తున్నారు.. షోలో డబ్బులిచ్చి హౌస్​లోకి..: సరయు

తెలుగులో అనేక టెలివిజన్ షోలు వస్తున్నాయి. వాటిల్లో చాలా షోలు హిట్టయ్యాయి కూడా. అయితే ఈ షోల్లో ‘బిగ్​బాస్​’ కాస్త ప్రత్యేకం అనే చెప్పాలి. ఈ రియాలిటీ షోకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవల్ అనేది తెలిసిందే. పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఒకే హౌస్​లో కొన్నాళ్ల పాటు ఉండటమే బిగ్​బాస్ షో కాన్సెప్ట్. గత కొన్ని సీజన్లుగా ప్రేక్షకుల నుంచి విశేషాదరణను చూరగొంటూ వస్తున్న ‘బిగ్​బాస్’ షో ఈసారి మరింత సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు ఆఖరి వారంలో లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్​లో బిగ్​బాస్​ సీజన్ 7 మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో బిగ్​బాస్​ షోకు సంబంధించి మాజీ కంటెస్టెంట్ సరయు షాకింగ్ విషయాలు బయటపెట్టారు.

బిగ్​బాస్​ షోపై చాలా మందిలో అనేక సందేహాలు ఉన్నాయి. షో నిర్వహణ తీరు దగ్గర నుంచి ఎలిమినేషన్స్, నామినేషన్స్.. చివరికి విన్నర్లను ప్రకటించడం వరకు పలు విషయాలపై అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సరయు చేసిన కామెంట్స్​ను బట్టి చూస్తే ఇది నిజమని అనిపించక మానదు. బిగ్​బాస్ సీజన్ 5లో తొలి వారమే ఎలిమినేట్ అయిన సరయు.. ఆ తర్వాత మళ్లీ ఓటీటీకి వెళ్లింది. అప్పుడు కూడా నాలుగో వారంలో ఎలిమినేట్ అయింది. బయటకు వచ్చిన తర్వాత తాను పీఆర్​ టీమ్​ల వల్లే ఎలిమినేట్ అయ్యానంటూ అప్పట్లో సంచలన కామెంట్స్ చేసింది. ఇప్పుడు మరోమారు బిగ్​బాస్ షో గురించి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

బిగ్​బాస్​కి వెళ్తే షో వాళ్లు డబ్బులు ఇవ్వడం కాదు.. కొంతమంది ఎదురు డబ్బులు ఇచ్చి మరీ హౌస్​లోకి వెళ్తారని సరయు తెలిపింది. అలాంటి కంటెస్టెంట్లకు హౌస్ లోపల పూర్తిగా సపోర్ట్ ఉంటుందని ఆమె చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో సరయు మాట్లాడుతూ.. ‘బిగ్​బాస్ షో మాత్రమే కాదు.. రియాలిటీ షోస్ అంటేనే ఫేక్. కొనుక్కొని తిరిగి వాళ్లకే డబ్బులు ఎదురిచ్చి.. మన అనుకున్న వాళ్లను ప్రమోట్ చేయడమే రియాలిటీ షో. వీటి ద్వారా మనందర్నీ పిచ్చోళ్లను చేస్తున్నారు. దయచేసి, ఇలాంటి షోలను అస్సలు చూడొద్దు. మీ టైమ్​ను వేస్ట్ చేసుకోవద్దు. నేను బిగ్​బాస్ హౌస్​లోకి వెళ్లిన తర్వాత కొంతమంది గ్రూప్ సభ్యులకు బిగ్​బాస్ హౌస్ బయటే కాదు.. లోపలా సపోర్ట్ ఉండేది. అంతగా ఇన్నర్ సపోర్ట్ ఉంది కాబట్టే వాళ్ల కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవల్లో ఉండేది. అలాంటి వారిని అడ్డుకోవడం చాలా కష్టం. వాళ్ల మీద ఫైట్ చేసినా మనం నెగిటివ్ అయిపోతాం. అది చాలా బాధాకరం’ అంటూ చెప్పుకొచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి