iDreamPost
android-app
ios-app

సీటిమార్ ఎంట్రీతో పోటీ ఆసక్తికరం

  • Published Aug 24, 2021 | 7:55 AM Updated Updated Aug 24, 2021 | 7:55 AM
  • Published Aug 24, 2021 | 7:55 AMUpdated Aug 24, 2021 | 7:55 AM
సీటిమార్ ఎంట్రీతో పోటీ ఆసక్తికరం

మెల్లగా పెద్ద సినిమాలు నాన్చడం వదిలేస్తున్నాయి. ధైర్యంగా రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నాయి. మీనమేషాలు లెక్కబెడితే ఆలస్యం వల్ల నష్టమే తప్ప లాభం లేదని గుర్తించి విడుదల తేదీలను ఫైనల్ చేస్తున్నాయి. తాజాగా ‘సీటిమార్’ రేస్ లో జాయిన్ అయ్యింది. నిన్నటి దాకా ఎప్పుడు వస్తుందా అనే ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ సెప్టెంబర్ 3కు ఫిక్స్ అయిపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. రామ్ చరణ్ రచ్చతో మాస్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. ఈ హీరో డైరెక్టర్ కాంబోలో గతంలో గౌతమ్ నందా వచ్చింది.

అదే రోజు సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ ఉండటంతో పోటీ కాస్త ఆసక్తికరంగా మారుతోంది. హాస్య చిత్రాల దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి రూపొందించిన ఈ మూవీలో బాబీ సింహా కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఒక ఆడియో సింగల్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంది. అవసరాల శ్రీనివాస్ టైటిల్ రోల్ పోషించిన ‘101 జిల్లాల అందగాడు’ కూడా 3కే వస్తున్నాడు. మేఘ ఆకాష్ ప్రధాన పాత్ర పోషించిన ‘డియర్ మేఘ’ కూడా బరిలో దిగుతోంది. ఇది కన్నడ హిట్ మూవీ దియాకు రీమేక్ వెర్షన్. కొద్దిరోజుల క్రితం దియా డబ్బింగ్ ని యుట్యూబ్ లో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నిర్మాతల మధ్య ఏవో ఒప్పందాల రగడ వల్ల అలా జరిగింది.

మొత్తానికి నాలుగు సినిమాలతో సెప్టెంబర్ 3 బాక్సాఫీస్ హాట్ గానే ఉండబోతోంది. ఇవే కాదు హాలీవుడ్ క్రేజీ మూవీస్ ఎఫ్9, షాంగ్ చై కూడా మెట్రో సిటీస్ లో గట్టి పోటీని ఇవ్వబోతున్నాయి. ఆగస్ట్ 30న థియేటర్లు తెరిచినప్పటికీ ఇప్పటిదాకా ఓ పది కోట్ల షేర్ ని దాటించే పెద్ద సినిమా ఏదీ రాలేదు. అది సీటిమార్ తోనే సాధ్యమవుతుందన్న నమ్మకం ట్రేడ్ లో ఉంది. ఇది తెచ్చే ఓపెనింగ్ తో లవ్ స్టోరీ దాన్ని కొనసాగించే అంచనాలలో పంపిణీదారులు ఉన్నారు. ఒకవైపు ఓటిటి రిలీజుల తాకిడి కూడా సెప్టెంబర్ లోనే ఎక్కువ కాబోతోంది. చూస్తుంటే మూవీ లవర్స్ కు కావాల్సినంత ఎంటర్ టైన్మెంట్ వచ్చే నెల ఫుల్ గా దొరకబోతోంది

Also Read : చిలిపి దొంగ కలెక్షన్లు – సేఫా కాదా

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet