iDreamPost
android-app
ios-app

Maanaadu Remake : టైం లూప్ సినిమాని మళ్ళీ తీయబోతున్నారా

  • Published Jan 05, 2022 | 11:07 AM Updated Updated Jan 05, 2022 | 11:07 AM
Maanaadu Remake : టైం లూప్ సినిమాని మళ్ళీ తీయబోతున్నారా

నెల క్రితం విడుదలై తమిళంలో మంచి విజయం సాధించిన మానాడు తెలుగులో రీమేక్ అయ్యేలా ఉంది. నిజానికి ఇది స్ట్రెయిట్ వెర్షన్ తో పాటే ఇక్కడా డబ్బింగ్ వెర్షన్ ని రిలీజ్ చేయాలని ది లూప్ టైటిల్ తో అంతా సిద్ధం చేసి పెట్టారు. తీరా చూస్తే అడ్వాన్ బుకింగ్ పెట్టాక షోలు పడలేదు. దాని తర్వాత గీత ఆర్ట్స్ ఓ మెగా హీరోతో రీమేక్ చేసే ప్లానింగ్ లో ఉందని సాయి ధరమ్ తేజ్ ఆప్షన్ గా చూస్తోందని రకరకాల వార్తలు వచ్చాయి. కానీ అవేవి నిజం కాదు. మానాడుకు సంబంధించిన అన్ని హక్కులు సురేష్ సంస్థ వద్ద ఉన్నాయి. ఈ మేరకు ఇవాళ ఒక పబ్లిక్ నోటీస్ విడుదల చేశారు. మానాడు కంటెంట్ ని వాడుకుంటే లీగల్ చర్యలకు హెచ్చరించారు.

ట్విస్ట్ ఏంటంటే ఈ మానాడు ఇటీవలే సోనీ లివ్ లో వచ్చేసింది. తమిళ్ ఒకటే పెడితే పర్లేదు. తెలుగు డబ్బింగ్ కూడా ఉంచేశారు. ఎస్ జె సూర్య తన పాత్రకు తనే గాత్రదానం చేయగా ఇతరుల ఆర్టిస్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ క్వాలిటీ కనిపించింది. అన్ని హక్కులు సురేష్ దగ్గర ఉన్నప్పుడు సోనీలో కేవలం తమిళంలో మాత్రమే ఉండాలి. కానీ తెలుగు ఎలా వచ్చింది. అదే అంతు చిక్కడం లేదు. ఇప్పటికే ఆ యాప్, ఇతరత్రా పైరసీ డౌన్ లోడ్ సైట్స్ లో నుంచి దిగుమతి చేసుకుని చూసిన వాళ్ళ సంఖ్య భారీగా ఉంది. మరి ఈ మానాడుని సురేష్ బాబు ఓటిటి కోసం తీస్తారా లేక పెద్ద హీరో దొరికితే థియేటర్ కు మారుస్తారా చూడాలి.

టైం లూప్ ఆధారంగా రూపొందిన మానాడులో ముఖ్యమంత్రిని చంపేందుకు స్కెచ్ వేసిన ఒక పోలీస్ ఆఫీసర్ అతన్ని ఆపేందుకు ప్రయత్నించే ఒక ముస్లిం యువకుడు ఇద్దరి మధ్య మైండ్ గేమ్ గా దర్శకుడు వెంకట్ ప్రభు చూపించారు. రిపీట్ సీన్లు పదే పదే ఉన్నప్పటికీ బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే ని సెట్ చేసుకున్న తీరు ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో తీస్తే బాగానే ఉంటుంది కానీ ఇలాంటివి డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ కు అయితేనే బాగుంటాయి. నేను ఇకపై అధికశాతం సినిమాలు ఓటిటి కోసమే తీస్తానని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పిన సురేష్ బాబు మానాడు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Also Read : Bangarraju : నాగ్ చైతూల కెరీర్ బెస్ట్ అవుతుందా