iDreamPost
android-app
ios-app

తెలంగాణ ప్రజలకు ఊరట.. జిల్లా ఆస్పత్రిలోనే ఆ సేవలు.. HYD రావాల్సిన పనిలేదు

  • Published Aug 06, 2024 | 1:15 PM Updated Updated Aug 06, 2024 | 1:15 PM

TG Govt-MRI, CT Scan, District Hospitals: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా వాసులు.. ఆ సేవల కోసం నగరాలకు వచ్చే పని లేదని.. ఇక డిస్ట్రిక్‌ ఆస్పత్రుల్లోనే ఆ సేవలు అందిస్తామని తెలిపింది. ఆ వివరాలు..

TG Govt-MRI, CT Scan, District Hospitals: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా వాసులు.. ఆ సేవల కోసం నగరాలకు వచ్చే పని లేదని.. ఇక డిస్ట్రిక్‌ ఆస్పత్రుల్లోనే ఆ సేవలు అందిస్తామని తెలిపింది. ఆ వివరాలు..

  • Published Aug 06, 2024 | 1:15 PMUpdated Aug 06, 2024 | 1:15 PM
తెలంగాణ ప్రజలకు ఊరట.. జిల్లా ఆస్పత్రిలోనే ఆ సేవలు.. HYD రావాల్సిన పనిలేదు

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోంది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ రంగాలకు భారీ కేటాయింపులు చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మండలానికి ఒక ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలానే వైద్య రంగానికి కూడా భారీగా నిధులు కేటాయించింది. కొత్త మెడికల్ కాలేజీలతో పాటు, ఆసుపత్రుల నిర్మాణం చేపట్టింది. అంతేకాక ఆ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తోంది. వీటితో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం ఆసుపత్రిల్లో అధునాతన వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుంతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా ఆసుపత్రుల్లోనే ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు రెడీ అయింది. ఇది అమల్లోకి వస్తే జిల్లా వాసులు హైదరాబాద్‌ వచ్చే అవసరం లేదు అంటున్నారు. ఆ వివరాలు..

జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సేవలు అందుబాటులో ఉండవు. మరీ ముఖ్యంగా ఎమ్మారై, సీటీ స్కాన్‌ వంటి సేవల కోసం జనాలు పట్టణాలు, నగరాలకు రావాల్సిందే. పేదవారైతే.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేక.. హైదరాబాద్‌లోని పెద్ద పెద్ద ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తారు. అయితే ఇకపై ఈ సమస్యలు తీరనున్నాయి. ఎలా అంటే.. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ వంటి పెద్దాసుపత్రుల్లో అందించే వైద్య సేవలను ఇకపై ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది.

ఈ మేరకు రేవంత్‌ సర్కార్‌.. ఇప్పటికే పలువురు సీనియర్ డాక్టర్లను జిల్లా హాస్పిటళ్లకు బదిలీ చేసింది. జిల్లా కేంద్రంలోని అన్ని ఆస్పత్రుల్లోనూ ఎమ్మారై సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం మెషీన్ల కొనుగోలుకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. సర్కార్‌ నిర్ణయంతో ఇకపై ఈ సేవలన్ని.. జిల్లా ఆసుపత్రుల్లోనే పొందే వీలుంది. ఇక హైదరాబాద్‌ ఆసుపత్రుల్లో ఖాళీ అయిన పోస్టులను వారం రోజుల్లో భర్తీ చేస్తామని ఇప్పటికే వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

ఇప్పటికే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ పథకం లిమిట్‌ 5 లక్షల రూపాయల వరకు ఉండగా.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌ ఆ మొత్తాన్ని రూ. 10 లక్షలకు పెంచింది. దాంతో పాటు ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ కూడా చేపట్టారు. కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకంలో చేరుస్తూ రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా చేర్చిన 163 చికిత్సలతో కలిపి మొత్తం 1,835 చికిత్సలకు రూ.10 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. వీటిలో 1,375కు సంబంధించిన ప్యాకేజీల రేట్లు సగటున 20 శాతం వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.