iDreamPost
android-app
ios-app

టీడీపీ పగ్గాలపై పురందేశ్వరి కన్ను.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా?

  • Published Oct 19, 2023 | 2:20 PMUpdated Oct 19, 2023 | 2:20 PM
  • Published Oct 19, 2023 | 2:20 PMUpdated Oct 19, 2023 | 2:20 PM
టీడీపీ పగ్గాలపై పురందేశ్వరి కన్ను.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా?

గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలన్ని.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చుట్టూనే తిరుగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పురందేశ్వరిని తెలుగుదేశం పార్టీ నేతగా వర్ణిస్తున్నారు వైసీపీ నాయకులు. అందుకు తగ్గట్లుగానే.. కొన్ని రోజుల క్రితం పురందేశ్వరి.. లోకేష్‌ని వెంట పెట్టుకుని వెళ్లి.. అమిత్‌ షాను కలవడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక దీనిపై ఎలా స్పందిచాలో అర్థం కాక బీజేపీ నేతలు మౌనంగా ఉంటే.. వైసీపీ శ్రేణులు మాత్రం.. పురందేశ్వరి ఏ పార్టీలో ఉన్నా సరే.. చంద్రబాబు కోసమే పని చేస్తారని విమర్శిస్తున్నారు.

బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీ కోసమే పురందేశ్వరి ఎక్కువగా పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దాంతో పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిగా నియమించడంపై హైకమాండ్‌.. పునరాలోచనలో పడినట్లు వార్తలు వినిస్తున్నాయి. పురందేశ్వరి తీరు బీజేపీకి తలనొప్పిగా మారిందని.. త్వరలోనే ఆమెను పార్టీ నుంచి తప్పించే ప్రయత్నంలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

పురందేశ్వరికి పగ్గాలు ఇవ్వడానికి కారణం అదే..

ఏపీలో బీజేపీని నిలబెడుతుంది అనే ఉద్దేశంతోనే కాషాయ పార్టీ పెద్దలు పురందేశ్వరిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు. దీని వెనక ప్రధాన కారణం ఎన్టీఆర్‌ క్రేజ్‌ను ప్రస్తుతానికి అయితే చంద్రబాబు, టీడీపీ నేతలు మాత్రమే వినియోగించుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్‌ వారసురాలిగా పురందేశ్వరికి కూడా ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. దాంతో ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. ఎన్టీఆర్‌ వారసత్వాన్ని వాడుకుని.. భవిష్యత్తులోనైనా సరే.. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే ఆమెను అధ్యక్షురాలిగా చేశారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అయితే బీజేపీ ఆశలపై పురందేశ్వరి నీళ్లు చల్లారు. పార్టీ ఏదైనా సరే ఆమెకు కుంటుంబం, సామాజిక వర్గమే ముఖ్యమని వారి లబ్ధి కోసమే పని చేస్తారని తాజా చర్యలతో మరోసారి అర్థం అవుతుంది అంటున్నారు రాజకీయ విశేష్లకులు. పురందేశ్వరి వల్ల పార్టీకి కలిసి వస్తుందని భావిస్తే.. ఆమె మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిసుడటం బీజేపీ నేతలను షాక్‌కు గురి చేస్తోంది.

టీడీపీ పగ్గాల కోసం..

ఈ క్రమంలోనే ప్రస్తుతం ఏపీలో ఓ ఆకస్తికర ప్రచారం వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే.. పురందేశ్వరి టీడీపీ పగ్గాలపై కన్ను వేశారని.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చంద్రబాబు జైల్లో ఉంటే.. లోకేష్‌ ఢిల్లీకే పరిమితం అయ్యాడు. ఇక పురందేశ్వరి తీరుపై బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉంది. ఒకవేళ ఆమెని బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తే.. అప్పుడామె.. కాంగ్రెస్‌, వైసీపీలోకి వెళ్లలేదు. ఇక పురందేశ్వరి ముందుండే ఏకైక ఆప్షన్‌ టీడీపీ అంటున్నారు విశ్లేషకులు.

అలానే జరిగి.. ఒకవేళ పురందేశ్వరి తెలుగుదేశం పార్టీలో చేరితే.. నెమ్మదిగా టీడీపీ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ అవకాశం కోసమే ఆమె ఎదురు చూస్తున్నారని.. అందులో భాగంగానే బీజేపీని గాలికి వదిలి.. టీడీపీ కోసం పని చేస్తున్నారని అంటున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి