iDreamPost
android-app
ios-app

సౌండ్ సరిపోలేదు – మొదటి రోజు వసూళ్లు

  • Published Apr 03, 2021 | 5:35 AM Updated Updated Apr 03, 2021 | 5:35 AM
సౌండ్ సరిపోలేదు – మొదటి రోజు వసూళ్లు

కింగ్ అక్కినేని నాగార్జున ఏడాదిన్నర గ్యాప్ తర్వాత నిన్న వైల్డ్ డాగ్ తో పలకరించారు. భారీ అంచనాలు లేకపోయినా టీమ్ ముందు నుంచి వ్యక్తపరుస్తున్న నమ్మకంతో పాటు ట్రైలర్ లో చూపించిన కంటెంట్ ఆసక్తికరంగా ఉండటంతో ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అంతో ఇంతో నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ మాత్రం రాబట్టుకోలేకపోయాడు వైల్డ్ డాగ్. మాస్ ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే సబ్జెక్టు కాకపోవడం, పాటలు లేకపోవడం, జీరో ఎంటర్ టైన్మెంట్ అని ముందే తెలిసిరావడం లాంటి కారణాలు ప్రభావం చూపించాయి. అందుకే సుల్తాన్ దీనికన్నా మెరుగ్గా కలెక్షన్లు నమోదు చేయడం గమనార్హం.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు వైల్డ్ డాగ్ మొదటి రోజు సుమారు 1 కోటి 32 లక్షల షేర్ రాబట్టింది. గ్రాస్ రూపంలో చూసుకుంటే సుమారు 2 కోట్ల 60 లక్షల దాకా ఉంటుంది. ఇది చాలా తక్కువ మొత్తం. జరిగిన థియేట్రికల్ బిజినెస్ తొమ్మిది కోట్లే అయినప్పటికీ మొదటి రోజు ఎంత వస్తుందనేది ఇక్కడ చాలా కీలకం. టాక్ అంతో ఇంతో పాజిటివ్ గానే ఉంది కానీ మరీ అద్భుతాలు జరిగిపోయేంత అయితే కాదు. ఇవాళ రేపు కూడా బుకింగ్స్ వేగంగా లేవు. డైరెక్ట్ కౌంటర్ సేల్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. ఇక ఏరియాల వారీగా చూసుకుంటే లెక్కలు ఈ విధంగా ఉన్నాయి

ఏరియా వారీగా వైల్డ్ డాగ్ మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్ 

AREA SHARE
నైజాం  0.52cr
సీడెడ్   0.19cr
ఉత్తరాంధ్ర  0.16cr
గుంటూరు   0.07cr
క్రిష్ణ   0.08cr
ఈస్ట్ గోదావరి  0.07cr
వెస్ట్ గోదావరి  0.06cr
నెల్లూరు   0.05cr
Total Ap/Tg  1.20cr
రెస్ట్ అఫ్ ఇండియా 0.06cr
ఓవర్సీస్ 0.06cr
ప్రపంచవ్యాప్తంగా 1.32cr

ఇది ఎంత మాత్రం ఆశాజనకం కాదు. ఆఫీసర్ తోనో మన్మథుడు 2తోనో పోల్చుకుని సంతృప్తి పడటం అంత కన్నా కరెక్ట్ కాదు. ఓటిటి వద్దనుకుని మరీ వెండితెరకు వచ్చింది కాబట్టి దానికి తగ్గ ఫలితం అందకుంటేనే నిర్ణయం సార్ధకం అవుతుంది. ఇలా వీక్ కలెక్షన్స్ తో కాదు. మరి ఈ రోజు రేపు వీకెండ్ ని వైల్డ్ డాగ్ ఎలా వాడుకుంటుందనేది చాలా కీలకం. మరోవైపు సుల్తాన్ టాక్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నప్పటికి మాస్ దీనికే ఓటు వేయడం ప్రతికూలంగా మారింది. జరిగిన 9 కోట్ల బిజినెస్ ని బ్రేక్ ఈవెన్ తో పాటు వెనక్కు తేవడమే వైల్డ్ డాగ్ కి పెద్ద సవాల్ గా మారింది. వకీల్ సాబ్ రానున్న నేపథ్యంలో చేతిలో ఉన్నవి మరో ఆరు రోజులు మాత్రమే.