iDreamPost
iDreamPost
ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో థియేటర్లో సినిమా చూడటం మనలో చాలామందికి ఇష్టం. కనీసం నెలకో సినిమాకు వెళ్లాలని అనుకొంటాం. ఏదైనా మాల్ లో షాపింక్ కు వెళ్లినప్పుడు మల్టీపెక్స్ లో సినిమాను వాచ్ చేయడం చాలామందికి అలవాటు. ఈ ఇష్టం రానురానూ మరీ ఖరీదైపోతోందా?
అయితే మీ టికెట్ ధర ఎంత తక్కువైనా, ఎక్కువైనా సరే, రూ. 150-500. టిక్కెట్ రేటు గురించి ఎక్కువమంది పట్టించుకోరుకాని, చాలా మంది సినీ ప్రేక్షకులకు బాధ కలిగించే విషయం ఒకటుంది. అదే పాప్ కార్న్, కూల్ డ్రింగ్స్ రేట్లు ఎక్కువగా ఉండటం. పాప్ కార్న్ రేటు చూస్తే కొనేముందు చాలా మందిని ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేస్తుంది, కాదంటారా?
ఉదాహరణకు, BookMyShow యాప్ ప్రకారం, హైదరాబాద్ మాల్స్ లో PVR పాప్‌కార్న్ ధర ప్రస్తుతం టేస్ట్, సైజునుబట్టి రూ. 210-420 ఉంటుంది, అయితే పెప్సీ రేటు మాత్రం 280-330 మధ్య ఉంటుంది.
పాప్ కార్న్ కు ఇంత రేటు పెట్టాలా? బైట రూ.20కి దొరికే పెప్సీకి ఖర్చు చేయాలా? దీంతో మరో రెండు సినిమాలుచూడొచ్చుకదా? మీ ఫీలింగ్స్ నిజమే. కాని PVRలో చిరుతిండిరేట్లు, కూల్ డ్రింగ్స్ రేట్ల ఎందుకింత ఎక్కువగా ఉంటాయి? పీవీఆర్ ఛైర్మన్, MD F&B (తిండి,డ్రింక్స్) వ్యాపారం గురించి మాట్లాడారు. దీని వ్యాపార విలువ ఇప్పుడు రూ. 1,500 కోట్లు. అవును, థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింగ్స్ వ్యాపారం రేంజ్ ఇది.
మల్టీప్లెక్స్ చైన్ PVR అధినేత, అజయ్ బిజ్లీ(Ajay Bijli ) భారతీయులకు మంచి మల్టీప్లెక్స్ అనుభవం అవసరమని అంటున్నారు. మరి టిక్కెట్ రేటు కన్నా పాప్ కార్న్ రేటు ఎందుకంత ఎక్కువ? దీనికి ఆయన దగ్గర సమాధానముంది. PVR సినిమాల్లో తిండి రేట్లు ఎక్కువుగా ఉన్నాయన్న వినియోగదారులను తాను తప్పుపట్టనని, సినిమాలు సింగిల్ స్క్రీన్ నుండి మల్టీప్లెక్స్‌లకు ఇప్పటికీ మారుతున్నాయని, వీటిని నడపడానికి అయ్యే ఖర్చు, పెట్టుబడికి భారీగా తేడా ఉన్నందున ఈ మాత్రం రేట్లు తప్పవని ఆయన అంటున్నారు.
మాల్స్ లో ఎక్కువ స్క్రీన్స్ ఏర్పాటుచేయడం, థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం మౌలిక సదుపాయాలను ఎర్పాటుచేయడం, దీనికితోడు మాల్స్‌లో లీజుకు తీసుకున్న థియేటర్ కు అద్దె, వీటన్నింటిని లెక్కవేయాలని ఆయన చెబుతున్నారు.
క్వాలిటీ కావాలంటే ఖర్చు చేయాలి. వినియోగదారులు తమకు దొరికే సౌకర్యాలతో సంతోషంగా ఉన్నారని భావించినప్పుడు, ఫిర్యాదు చేయరని ఆయన కామెంట్ చేశారు. “ఇంతకుముందు, సింగిల్ స్క్రీన్‌లలో ఒక ప్రొజెక్షన్ రూమ్, ఒక సౌండ్ సిస్టమ్. టిక్కెట్లు ఇచ్చే చోటు, వెయిటింగ్ ప్లేస్ లకు ఎయిర్ కండిషన్ లేవు. అదే మల్టీప్లెక్స్‌లు వచ్చినప్పుడు ఈ సౌకర్యాలన్నది దొరుకుతున్నాయి. అందువల్ల మూలధన వ్యయం 4 నుండి 6 రెట్లు పెరిగిందని, ఆ ఖర్చులను రాబట్టుకోవాలంటే ఫుడ్ అండ్ బేవరేజెస్ కు ఆమాత్రం రేటు తప్పదని ఆయన విశ్లేషించారు.
మల్టీప్లెక్స్‌లల్లో, ఆరు ప్రొజెక్షన్ రూమ్స్ తో ఆరు స్క్రీన్‌లు, ఎయిర్ కండిషన్డ్ ఫోయర్‌తో పాటు, ఆరు సౌండ్ సిస్టమ్‌లు, వేచి ఉండే సినిమా థియేటర్‌లోని హాలు ఉన్నందున మూలధన వ్యయమేకాదు, మెయింటినెన్స్ కూడా పెరిగిందని ఆయన చెప్పారు. PVR వంటి కంపెనీలు థియేటర్లలో అమ్మే తిండి, కూల్ డ్రింగ్స్ మీద ఎక్కువ రేట్లు పెట్టడం వెనుక ఈ ఖర్చుల లెక్కలున్నాయని పీవీఆర్ యాజమాన్యం చెబుతోంది.
క్వాలిటీ సౌకర్యాలు ఉన్నాయికాబట్టే, అమ్మకాలు బాగున్నాయని పీవీఆర్ అంటోంది.