కరోనా వైరస్ వ్యాపిస్తున్నందున హోమ్ క్వారెంటైన్ లో ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్న కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా వైరస్ వ్యాప్తి చేస్తున్నారు.
విదేశాల నుండి వచ్చిన వారు ఖచ్చితంగా కరోనా వైరస్ టెస్టులు చేయించుకోవాలని ప్రభుత్వం చెబుతున్న విదేశాల నుండి వచ్చిన కొందరు ఆ విషయాన్ని దాచిపెట్టి పబ్లిక్ లో తిరగడం వల్ల వైరస్ ను మరికొందరికి వ్యాపిస్తుంది. దీనికి ఉదాహరణగా కొత్తగూడెం DSP కుమారుడి ఉదంతం ఉదాహరణగా నిలుస్తుంది.
యూకే నుండి వచ్చిన తన కుమారుడి విషయం బయట పెట్టకుండా దాచి పెట్టి పబ్లిక్ ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యారు. ఇక్కడ వరకూ బానే ఉంది.. కానీ ఆ DSP కుమారుడికి కరోనా సోకినట్లు తేలడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు DSP పై 188 సెక్షన్ ప్రకారం కేసు కూడా నమోదు చేశారు. హోమ్ క్వారెంటైన్ లో ఉండకుండా ప్రభుత్వానికి విదేశాల నుండి వచ్చిన విషయం తెలుపకుండా దాచిపెట్టి పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన పబ్లిక్ ఫంక్షన్ కి DSP కుమారుడు అటెండ్ అయ్యారు.
ఇప్పటికే DSP ఇంట్లో పనిచేసే పనిమనిషిలో కూడా కరోనా లక్షణాలు కనిపిస్తున్నట్లు సమాచారం.దీంతో DSP కుమారుడు ఎక్కడెక్కడ తిరిగారు ఎవరెవరిని కలిశారు అన్నదానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఫంక్షన్ లో పాల్గొన్నట్లు తెలియడంతో పశ్చిమగోదావరి జిల్లాలో కూడా కలకలం మొదలైంది.
కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరం అని తెలిసినా, దానివల్ల అగ్రదేశాలు కూడా వణుకుతున్నాయని తెలిసినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైరస్ ను వ్యాప్తి చేస్తున్నారు. ఇంటికే పరిమితం కావాలని ప్రభుత్వం,అధికారులు చెబుతున్న పెడచెవిన పెడుతూ బయట తిరుగుతున్నారు. ఇటలీ,చైనా,ఇరాన్,అమెరికా దేశాల పరిస్థితులు వైరస్ వల్ల ఎలా మారాయి అన్నది తెలిసినా కూడా నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నారు. దానికి ఉదాహరణ కొత్తగూడెం DSP SM అలీ ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ప్రజలు ఇలా నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడం వల్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నాయి. ప్రధాని మోడీ 21 రోజులు ఇళ్లకే పరిమితం కావాలని జనతా కర్ఫ్యూ కి మించిన లాక్ డౌన్ ఇది అని దేశం మొత్తం లాక్ డౌన్ విధించారు. ఇప్పటికైనా ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించి హోమ్ క్వారెంటైన్ లో ఉంటే అందరికీ మంచిది. ఏవైనా వైరస్ లక్షణాలు ఉంటే అధికారులకు తెలియజేస్తే తగిన చికిత్స అందిస్తారు.