Idream media
Idream media
దశాబ్దాల పాటు ఈనాడు చీఫ్ ఎడిటర్ గా ఉన్న రామోజీరావు సడెన్ గా ఎందుకు ఆ పదవి నుండి తప్పుకున్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు ఈనాడుకు చీఫ్ ఎడిటర్ గానే ఉండాలన్నది రామోజీరావు అభిప్రాయం. కానీ ప్రస్తుతం ఆయన చీఫ్ ఎడిటర్ పదవి నుండి తప్పుకున్నారు. ఆయన కేవలం ఈనాడు ఫౌండర్ అని పేపర్ లో చివర ఉంది. ఇప్పుడు తెలంగాణకు ఎడిటర్ గా డీఎన్ ప్రసాద్ పేరు, ఆంధ్రప్రదేశ్ కు ఎడిటర్ గా ఎం.నాగేశ్వర్ రావు వ్యవహరిస్తున్నారు. మరి ఇంత సడన్ గా రామోజీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో ఎవ్వరికి అర్ధం కావట్లేదు. రామోజీరావు ఆరోగ్య పరిస్థితుల కారణంగానే ఇలా జరిగిందని ప్రచారం సాగుతున్నా ఆయన హ్యాపీగా ఉన్నారని, ఆరోగ్య సమస్యల కారణం అనేది వాస్తవం కాదని కొందరు అభిప్రాయ పడుతున్నారు. రామోజీ తర్వాత ఆయన కుమారుడు చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు తీసుకుంటారని అనుకున్నా అది జరగలేదు ఆయన స్థానంలో రెండు రాష్ట్రాలకు ఇద్దరు సంపాదకులను నియమించారు.
సంపాదకులను వేరే వాళ్లను నిర్ణయించడానికి కొన్ని కారణాలున్నాయని మీడియా సర్కిల్ లో తెగ ప్రచారం సాగుతోంది.. ఈనాడు అంటే టీడీపి సొంత పత్రిక లాంటిదని, టీడిపి వాళ్లకు సపోర్ట్ గా వార్తలు ప్రచారం చేస్తుందనేది ఇన్ని దశాబ్దాల పాటు ఆ పేపర్ చూసిన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే. ఎవరెన్ని రకాలుగా టీడిపికి వ్యతిరేకంగా ప్రచారం సాగించిన ఈనాడు మాత్రం అనుకూలంగానే వార్తలు రాసేది. టీడిపిని విమర్శిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజేపి పైన వార్తల్లో తేడా చూపించేది. రామోజీరావు ఈనాడులో ఎప్పుడూ టీడిపి అనుకూలంగానే వార్తలు రాయించేవారు. టీడిపికి ఎవరు ప్రత్యర్థో వారి పై వ్యతిరేకంగా కూడా వార్తులు వచ్చేవి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మీద వ్యతిరేకంగా ఎన్ని వార్తలు రాసిందో లెక్కేలేదు. అయితే జగన్ సీఎం అయ్యాక పూర్తిగా మార్పు వచ్చింది. మీడియా విపరీత పోకడలకు బ్రేక్ వేయడానికి 2430 జీవోనే తీసుకొచ్చాడు. ఈ జీవో ప్రకారం వార్తలో నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు ప్రసారం చేస్తే పత్రిక వారయిన కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.
గతంలో ఇలాంటి కేసుల్లో ఆంధ్రజ్యోతి ఎడిటర్ జైలు పాలయ్యాడు కూడా. వార్తల్లో ఏదైనా నిరాధారోపణలతో వార్తలు ప్రచురిస్తే ఇరుక్కునేది ఎడిటర్లే , అందుకే రామోజీరావు ఎడిటర్ గా బాధ్యతల నుండి తప్పుకున్నట్టు సమాచారం. ఈ వయసులో లేని పోని సమస్యలెందుకని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అందరు అంటున్నారు. కాబట్టి ఇష్టమొచ్చినట్టు వార్తలు రాస్తే మొదట ఇబ్బందులు పడేది ఎడిటర్లే.. యాజమాన్యం ఇష్టప్రకారం రాజకీయ ప్రయోజనాల కోసం వార్తలు కాకుండా నిజనిజాలను తెలుసుకుని వార్తలు ప్రచురించాల్సిన బాద్యత ఎడిటర్ల పైనే ఉంటుందని జర్నలిస్టులు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని రామోజీ రాజీనామా ద్వారా అర్ధమవుతోంది.