Chiranjeevi
ఆయన ఓ నిర్మాత. ఓ టాప్ హీరోకి జిగిని దోస్త్. ఆ హీరో ఎక్కడ వుంటే పక్కన్నేను అన్నట్లు కనిపించేవారు. స్పెషల్ ఫ్లయిట్ అయితే హీరో పక్క సీటు ఆ నిర్మాతదే. ఏదైనా ఊరు వెళ్తే పక్కన ఈ నిర్మాతనే
ఆయన ఓ నిర్మాత. ఓ టాప్ హీరోకి జిగిని దోస్త్. ఆ హీరో ఎక్కడ వుంటే పక్కన్నేను అన్నట్లు కనిపించేవారు. స్పెషల్ ఫ్లయిట్ అయితే హీరో పక్క సీటు ఆ నిర్మాతదే. ఏదైనా ఊరు వెళ్తే పక్కన ఈ నిర్మాతనే
Chiranjeevi
ఆయన ఓ నిర్మాత. ఓ టాప్ హీరోకి జిగిని దోస్త్. ఆ హీరో ఎక్కడ వుంటే పక్కన్నేను అన్నట్లు కనిపించేవారు. స్పెషల్ ఫ్లయిట్ అయితే హీరో పక్క సీటు ఆ నిర్మాతదే. ఏదైనా ఊరు వెళ్తే పక్కన ఈ నిర్మాతనే. ఇలా ఎక్కడ చూసినా ఆ ఇద్దరూ కలిసే కనిపించేవారు. అలాంటిది గత రెండు మూడు నెలలు గా ఆ నిర్మాత ఆ హీరో పక్కన కనిపించడం లేదు. పోనీ హీరో ఎక్కడికి వెళ్లడం లేదు. అందువల్ల నిర్మాత కూడా కనిపించడం లేదు అని అనుకోవడానికి కూడా లేదు. ఆ హీరో తన సినిమా ప్రమోషన్ మీద దేశం అంతా తిరిగారు. కానీ పక్కన ఆ క్లోజ్ ఫ్రెండ్ కమ్ నిర్మాత జాడ ఒక్కసారి కూడా కనిపించలేదు. కారణం ఏమిటో మరి?
ఆ నిర్మాత సినిమా ఒకటి పూర్తయి విడుదలకు రెడీగా వుంది. కానీ ఎప్పుడు విడుదలవుతుంది అన్నది క్లారిటీ లేదు. నాన్ థియేటర్ అమ్మకాలకు నోచుకోకపోవడమే కారణం అని టాక్ వుంది. మరి ఆ పనుల్లోనో, ఆ టెన్షన్ లోనో వున్నారేమో ఆ నిర్మాత, దాని వల్లే ఈ క్లోజ్ ఫ్రెండ్ అయిన హీరోకి దూరంగా వున్నారనుకోవాలి.
ఏమైనా సరే, ముస్తఫా..ముస్తఫా అని పాడుకునే జోడీ ఇలా దూరం దూరంగా వున్నారంటే జనాలు ఏమైందో అని అనుకోవడం టాలీవుడ్ లో కామన్ కదా?