SNP
SNP
ఈ భూమి మీద ప్రతి జీవి తన తర్వాతి తరం కోసం తన భాగస్వామితో లైంగిక ప్రక్రియలో పాల్గొంటుంది. అది చాలా సహజమైంది. పాములలో కూడా సెక్స్ జరుగుతుంది. అయితే కొన్ని సార్లు అనకొండల మధ్య సెక్స్ తర్వాత మరణం మగ పాములకు మరణం సంభవిస్తుంది. అది కూడా అప్పటి వరకు తమతో కలిసి సంభోగించిన ఆడ పాటులే మింగేస్తాయి. అలా ఎందుకు చేస్తాయనే విషయంపై శాస్త్రవేత్తలు పరిశోదనలు జరుపుతున్నారు.
తాజాగా దక్షిణ అమెరికాలో కనుగొన్న జెయింట్ అనకొండ పాము లైంగిక జీవితానికి సంబంధించి షాకింగ్ సమాచారాన్ని జీసస్ పరిశోధన వెల్లడించింది. సెక్స్ తర్వాత, ఆడ పాము మగ పాముని తింటుందని పేర్కొన్నారు. ఆడ పాము సంభోగం సమయంలో మగ పాములపై ఆధిపత్యం చెలాయిస్తుందట. పరిమాణంలో మగ పాము కంటే ఆడపాటు పెద్దదిగా ఉండటే దీనికి ప్రధాన కారణం. అనకొండ జాతులలో ఆడ పాము, మగ దానికంటే కంటే ఐదు రెట్లు పెద్దగా ఉంటుంది. కాబట్టి మగ దానిని ఆడది సులభంగా మింగగలదు.
పాము జాతుల్లో సెక్స్ చేయాలనే కోరిక మొదట ఆడ పాములోనే కలుగుతుందని సైంటిస్టులు వెల్లడిస్తున్నారు. ఆడ పాము చల్లని లేదా వేడి వాతావరణంలో నిద్రాణస్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు, అది దాని చర్మాన్ని తొలగిస్తుంది. అప్పుడు అది ఫెరోమోన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దాని వాసనను మగ పాములు పసిగట్టి సంభోగానికి సిద్ధమవుతాయి. సంభోగం ప్రక్రియ అంతటా ఆడది ఎల్లప్పుడూ ఆధిపత్యం ప్రదర్శిస్తుందని, సహచరుడి ఎంపిక నుంచి సంభోగం కాలం వరకు నిర్ణయాధికారం ఆడపాముదే ఉంటుందని తెలిపారు. మగ పాము సెక్స్‌లో సంతృప్తి కలిగించకపోతే, ఆడ పాము వెంటనే దాన్ని దూరంగా నెట్టివేసి మరొక భాగస్వామి కోసం చూస్తుందట. ఆడ అనకొండ సంభోగం తర్వాత మగదాన్ని మింగేస్తుంది. కాబట్టి సెక్స్ తర్వాత మగపాము తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందని శాస్త్రవేత్తలు వారి పరిశోదనల్లో వెల్లడిస్తున్నారు.