iDreamPost
android-app
ios-app

వింత ఘటన.. పామును కరిచిన మనిషి.. దెబ్బకు మృతి

సాధారణంగా పాములు కనబడగానే నాగ దేవత అంటూ మొక్కుతుంటారు. త్వరపడి చంపేందుకు ప్రయత్నించరు. పామును చంపితే పిల్లలు పుట్టరని, ఏదో కీడు జరుగుతుందని భావిస్తుంటారు. కానీ చాలా మంది పాము కాటుకు బలౌపోతుంటారు. తాజాగా

సాధారణంగా పాములు కనబడగానే నాగ దేవత అంటూ మొక్కుతుంటారు. త్వరపడి చంపేందుకు ప్రయత్నించరు. పామును చంపితే పిల్లలు పుట్టరని, ఏదో కీడు జరుగుతుందని భావిస్తుంటారు. కానీ చాలా మంది పాము కాటుకు బలౌపోతుంటారు. తాజాగా

వింత ఘటన.. పామును కరిచిన మనిషి.. దెబ్బకు మృతి

ఇండియాలో పాములు అనగానే దేవతగా చూస్తుంటారు. వాటికి గుడి కట్టి పూజిస్తుంటారు. ఇక నాగులు చవితి, సుబ్రమణ్య షష్టి వంటి పండుగల సమయాల్లో పుట్టలో గుడ్డు, పాలు పోసి, పాముల పుట్టలకు దీపారాధన చేస్తుంటారు. అంతేకాకుండా మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అలాగే సినిమాల ప్రభావం వల్ల కూడా పాములు అంటే దేవళ్లుగా కొలుస్తుంటారు. ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి.. నాగమ్మ, దేవి, ఇప్పుడు వస్తున్న నాగిని సీరియల్ వరకు ప్రేక్షకాదరణ చూరగొంటున్నాయి. దీని వల్లే పాము కాటేస్తే.. పగబట్టిందని మాట్లాడుకుంటూ ఉంటారు. సాధారణంగా ఓ పాము కాటేస్తే.. విషపూరితమైనది అయితే.. మనిషి నిమిషాల్లో మరణిస్తాడు. కానీ మనిషి కాటేస్తే పాము చనిపోయిన వింత ఘటన చోటుచేసుకుంది.

పాము తనను కాటేసిందన్న కోపంతో తిరిగి దాన్ని కరవడంతో చనిపోయింది. ఈ ఘటన బీహార్ లోని నవాడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజౌలీ దట్టమైన అడవిలో పనిచేస్తున్నాడు రైల్వే కార్మికుడు సంతోష్ లోహార్. మంగళవారం రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాడు. అంతలో అతడ్ని పాము కాటేసింది. దీంతో ఏదో కుట్టిందని లేచి చూడగా.. పాము కనిపించింది. తనను పాము కాటేసిందన్న కోపంతో..వెంటనే పామును పట్టుకుని, రెండు సార్లు కొరికాడు. దీంతో పాము మరణించింది. అతడు సమీపంలోని ఆసుపత్రికి వెళ్లగా..చికిత్స అందించారు. పాము తనను కరిచినా, తిరిగి అతడు పామును కొరికినా.. విషం అతడ్ని ఏం చేయలేకపోయింది. అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.

చివరకు ఆసుపత్రి నుండి అతడు బయటపడ్డాడు. స్నేహితులు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి.. రైల్వే ఉద్యోగి సంతోష్.. రాజౌలీలోని దట్టమైన అడవిలో రైల్వే పనులు చేస్తున్నాడు. రోజులానే మంగళవారం కూడా పనులు పూర్తయ్యాక.. రాత్రి భోజనం చేసి..పడుకున్నాక అతడ్ని పాము కరిచింది. లేచి చూసే సరికి దాన్ని చూసి కోపంతో పామును పట్టుకుని రెండు సార్లు కొరికాడు. అంతే అది చనిపోయింది. అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు. అయితే ఈ ఘటన చూస్తుంటే.. విషానికి విషమే విరుగుడు అని పెద్దలు చెప్పిన మాటలు ఇక్కడ అక్షర సత్యమని అనిపిస్తుంది.  అలాగే సుమతీ శతకం పద్యంలోని ఈ పదాలు కూడా గుర్తుకు రాకమానవు. పామునకు తలయందు విషము ఉండును. తేలుకు విషము తోకలో ఉండును. కానీ దుర్మార్గుడైన మనిషిక తల, తోక తేడా లేకుండా శరీరమంతా విషము ఉంటుందని ఓ పద్యం ఉంది.. గుర్తుకు వచ్చిందా..? నిజమేనంటారా…? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.