iDreamPost
android-app
ios-app

కాటేసిన పాముతో ఆస్పత్రికి వెళ్లిన యువకుడు!

చాలా మందికి పాము పేరు వినగానే భయంతో వణికిపోతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తనను కాటేసిన పామునే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కాసేపు ఆస్పత్రిలో పాముతో ఆ యువకుడు హల్ చల్ చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే...

చాలా మందికి పాము పేరు వినగానే భయంతో వణికిపోతారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తనను కాటేసిన పామునే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కాసేపు ఆస్పత్రిలో పాముతో ఆ యువకుడు హల్ చల్ చేశాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే...

కాటేసిన పాముతో ఆస్పత్రికి వెళ్లిన యువకుడు!

సాధారణంగా చాలా మందికి పాము అంటే చాలా భయం ఉంటుంది. అందుకే అది పొరపాటున కనిపిస్తే .. ఆమడ దూరం పరిగెత్తుతారు. అలానే పాము కాటు కారణంగా కూడా ఎందరో మృతి చెందారు. మరికొందరు అయితే పాము కాటు కంటే ఆ భయంతోనే మరణిస్తున్నారు.  చాలా మంది పాము కాట్టేసిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని ప్రాణాలు దక్కించుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.  తనను పాము కాట్టేస్తే.. పామును తీసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ ఉండే ఇతర రోగులు, వైద్యులు ఆందోళన చెందారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. ప్రస్తుతం ఈ యువకుడి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానిక మీడియా కథనం ప్రకారం…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లా ఓ యువకుడు హల్ చల్ చేశాడు. లాల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పతుల్కీ గ్రామానికి చెందిన సూరజ్ అనే యువకుడు..తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.  సోమవారం సాయంత్ర సూరజ్ తన ఇంటి ముందు ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో ఓ పాము అతడిని కాటు వేసింది. దీంతో సూరజ్ భయపడకుండా…పారిపోతున్న పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. కాసేపటి తరువాత చివరకు తనను కాటేసిన పామును పట్టుకున్నాడు.

ఆ పామును ఓ సంచిలో వేసుకుని  చికిత్స కోసం దగ్గర్లోనీ మీర్జాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి బైక్ పై వెళ్లాడు. అక్కడ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి.. వైద్యులతో మాట్లాడాడు. తాను పాముకాటుకు గురయ్యానని తక్షణమే ఇంజెక్షన్ ఇవ్వాలని సూరజ్ వైద్యులను కోరాడు.  అంతేకాక తన వెంట తెచ్చిన పామును సంచిలో నుంచి తీసి ఎమర్జెన్సీ వార్డు బెడ్ పై ఉంచాడు.  కాసేపు అక్కడి వైద్యులు, ఇతర సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. కాసేపుటి తరువాత సూరజ్ ఆ పామును సంచిలో వేసి బంధించాడు. వైద్యులు అతడికి యాంటీవీనమ్ అనే ఇంజెక్షన్ ఇచ్చారు.

ఇక అతడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారని సమాచారం. ప్రస్తుతం సూరజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడిపై మిశ్రమ కామెంట్స్ వస్తున్నాయి. పాము కాటేస్తే.. ఆస్పత్రికి తీసుకురావడం ఏంటని కొందరు నెటిజన్లు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు సూరజ్ చేసిన పనిని మెచ్చుకున్నారు. ఏ  పాము కాటు వేసిందో సరైన ఇంజెక్షన్ ఇవ్వొచ్చని అంటున్నారు. మరి..సూరజ్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.