iDreamPost
android-app
ios-app

వీడియో: హెల్మెట్‌లో దూరిన నాగు పాము! బైక్ తీస్తుండగా..

వీడియో: హెల్మెట్‌లో దూరిన నాగు పాము! బైక్ తీస్తుండగా..

నిత్యం ఎంతో మంది బైకులపై ఆఫీసులకు, ఇతర కార్యాలయాలకు వెళ్తుంటారు. హడావుడి జీవితం కావడంతో తమ వస్తువులను సరిగ్గా చూసుకోకుండా ధరిస్తుంటారు. ముఖ్యంగా బైక్ హెల్మెంట్, బ్యాగ్స్ వంటి వాటిని చెక్ చేసుకోకుండానే తమ వెంట తీసుకెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో మృత్యువు వాటిలోనే దాగి ఉంటుంది. ఎలా అనే సందేహం మీకు రావచ్చు. కొన్ని సందర్భాల్లో విష సర్పాలు, ఇతర కీటకాలు అందులో ఉంటాయి. వాటిని గమనించ కుండా హెల్మెంట్ ధరించి.. ప్రాణాలు కోల్పోయిన వాళ్లు ఉన్నారు. అలానే ద్విచక్ర వాహనంలోని పలు చోట్ల పాములు నక్కి దాకుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో దర్శనమిస్తుంటాయి. తాజాగా ఓ వ్యక్తికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. బైక్ పై వెళ్లేందుకు హెల్మెంట్ బయటకు తీయగా అందులో నుంచి బుసలు కొడుతూ నాగు పాము పిల్ల వచ్చింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

కేరళ రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలోని పుతూర్ లో పొంటెకాల్  సోజన్ నివాసం ఉంటున్నాడు. ఆయన తాను పని చేసే చోట బైక్ ను పార్క్ చేసి, దానికి హెల్మెట్ ను తగిలించి లాక్ చేసి ఉంచాడు. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో బైక్ ను తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ముందుగా తన ద్విచక్ర వాహనానికి ఉన్న హెల్మెంట్ ను  తీసేందుకు ప్రయత్నించాడు. హెల్మెట్  ను తీస్తుండగా, అందులో ఏదో కదులుతున్నట్లు ఆయన గమనించాడు. హెల్మెండ్ ను పక్కన పెట్టి పరిశీలించి చూస్తే లోపల చిన్న నాగు పాము పిల్ల కనిపించింది. హడలిపోయిన అతడు హెల్మెట్ ను దూరంగా పెట్టి.. పారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందించారు. దీంతో  ఆ శాఖకు చెందిన ఓ వలంటీర్ అక్కడకు చేరుకుని హెల్మెట్ లోంచి పామును జాగ్రత్తగా బయటకు తీశాడు.

బయట తీయడంతోనే బుసలు కొడుతు కాసేపు హల్ చల్ చేసింది.. ఆ పిల్ల నాగు. రెండు నెలల వయసు ఉండే ఆ నాగు పామును  సంచిలో వేసి తీసుకెళ్లారు. దీంతో తనకు ప్రాణాపాయం తప్పిందని సోజన్ ఊపిరి పీల్చుకున్నాడు. పాము ఉన్న విషయం గమనించకుండా హెల్మెంట్ ధరించి ఉంటే ప్రాణాలకే ముప్పు వచ్చి ఉండేదని సోజన్ ఆందోళన వ్యక్తం చేశాడు. గతంలో ఇలానే ఎన్నో ఘటనలు జరిగి.. చాలా మంది ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం ఈ నాగు పాము పిల్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు.. వీడియోను వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.