Idream media
Idream media
ఏపీ సర్కారుపై ఫిర్యాదు కోసమంటూ గత నె 25, 26 తేదీల్లో ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు అమిత్‌షా అపాయింట్‌మెంట్ కోరారు. ఆయనకు షా అపాయింట్ మెంట్ దక్కలేదు. ఓ టీడీపీ ఎంపీ ఆయన అపాయింట్ మెంట్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో వేచి చూసి చంద్రబాబు తిరిగి వచ్చేశారు. దీనిపై పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. దీంతో ఆ వెంటనే.. కశ్మీర్ పర్యటన, ఇతర కార్యక్రమాల షెడ్యూల్ వలన అపాయింట్‌మెంట్ కుదరకపోవడంతో.. మర్నాడు చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకున్న అమిత్ షా త్వరలోనే కలుద్దామని చంద్రబాబు కు చెప్పినట్లు టీడీపీ వర్గాలు పదే పదే ప్రస్తావించాయి. అదే నిజమైతే.. ఏపీకి వచ్చినప్పుడైనా అమిత్ షా బాబుకు అపాయింట్ మెంట్ ఎందుకివ్వలేదు.. అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది.
ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతి సహా కేంద్రంలో పెద్దలను కోరేందుకు గత నెలలో చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతిని కూడా కలిసేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కూడా కలవాలనుకున్నారు. కానీ బాబుకు ఆయన అపాయింట్ మెంట్ దక్కలేదు. అమిత్ షా జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉండటంతో వీలుపడలేదు. ఈ క్రమంలో షా పర్యటన నుంచి తిరిగొచ్చిన తర్వాత బాబుకు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారని టీడీపీ వర్గాలు చెప్పుకున్నాయి. అదంతా టీడీపీ అభూత కల్పనేనని సోషల్ మీడియా కోడై కూసింది. ఎందుకంటే హోం శాఖ నుంచి దీనిపై ఎటువంటి ప్రకటనా వెలువడ లేదు. కేవలం టీడీపీ నుంచి మాత్రమే ఈ సమాచారం చక్కర్లు కొడుతోంది. ఎల్లో మీడియాలో మాత్రమే దీనిపై ప్రముఖంగా చెబుతున్నారు. దీంతో షా నుంచి బాబుకు ఫోన్ రాలేదన్న ప్రచారం జరిగింది.
ఇటీవల తిరుపతి వచ్చిన అమిత్ షాను చంద్రబాబు కలవకపోవడం కూడా ఆ ప్రచారానికి ఊతం ఇస్తోంది. ఒకరోజు షెడ్యూల్ ను పొడిగించుకుని మరీ షా ఏపీలో ఉన్నారు. అయినప్పటికీ వారి భేటీ జరగలేదు. పైగా ఒకవైపు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం టీడీపీ పాకులాడుతున్న నేపథ్యంలో.. టీడీపీపై అమిత్ షా ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అమిత్ షా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పరిస్థితితో ఏపీలో రాజకీయ శూన్యత ఏర్పడిందని.. ఈ పరిస్థితుల్లో సొంతంగా ఎదగడం గురించి పని చేయాలని అమిత్ షా తమ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం. టీడీపీ పరిస్థితి దృష్ట్యా ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీనే ఎదిగేందుకు ప్రయత్నించాలని షా ప్రధానంగా చేసిన ఉద్భోధగా తెలుస్తోంది.
అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవలి ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబు చేసుకున్న ఫోన్ కాల్ ప్రచారం లో డొల్ల ఎంత ఉందో కూడా క్లారిటీ వస్తోంది. అమిత్ షా ఏపీకి వచ్చినా.. చంద్రబాబు నాయుడు కనీసం కలిసే ప్రయత్నం చేయలేకపోయారు. అధికారిక హోదాతో అయినా చంద్రబాబు నాయుడు ఆయనతో సమావేశానికి ఆస్కారం ఉంది. అయితే అలా వెళ్లినా అమిత్ షా ఎలా అవమానిస్తారో అని చంద్రబాబు నాయుడు భయపడినట్టుగా ఉన్నారు. అందుకే అమిత్ షా ఏపీకి వచ్చి వెళ్లారనే అంశం తెలియనట్టుగా టీడీపీ వ్యవహరిస్తూ ఉంది. అసలు షా రాకే తమకు తెలియదన్నట్లుగా వ్యవహరిస్తోంది.