తప్పులు బయటపడితే గానీ.. భయం నెత్తికెక్కదు అన్నది సామెత. ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విషయంలోనూ ఇదే నిజమవుతోంది. ఈఎస్ఐ స్కాం లో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు కు అసలు తత్వం బోధపడింది. మరోపక్క నానాటికీ దిగజారిపోతుందని తెలుగుదేశం పార్టీ స్థితిని ఆయన స్వయంగా చూసి… తన అనుకున్న వారికి ఇప్పుడు సూక్తులు, ప్రవచనాలు చెబుతున్నారు.
అన్ని విషయాల్లో దూకుడుగా ఉండి, ప్రభుత్వం మీద ఇష్టానుసారం నిందలు వేసే అచ్చెన్నాయుడు పంథాలో ఇప్పుడు పూర్తిగా మార్పు కనిపిస్తోంది. పేరుకు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అయినా కేవలం శ్రీకాకుళం జిల్లాకు మాత్రమే ఆయన పరిమితమయ్యారు. ఆయన సొంత నియోజకవర్గం టెక్కలి వ్యవహారాల్లోనే తల దురుస్తున్నారు. ఆరోగ్య కారణాల రీత్యా, ఇతర పరిస్థితులవల్ల బయటకు రావడానికి అచ్చెన్నాయుడు ఇష్ట పడటం లేదని క్యాడర్ చెబుతున్నా, పార్టీ వాస్తవిక పరిస్థితిని అంచనా వేసే అచ్చేం నాయుడు దూరంగా ఉన్నారు అని టిడిపి లో ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కాకమునుపు మంచి ఫైర్ లో ఉండే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో ఇరుక్కోవడం, జైలుకు వెళ్లడం వంటివి ఆయనకు తత్వం నేర్పాయి. రాష్ట్ర అధ్యక్షుడు పోస్టును చంద్రబాబు బీసీ వర్గాల జపం కోసమే అచ్చెన్నాయుడుకీ కట్టబెట్టారని ఆయనకి తెలుసు. దీంతో పాటు ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో కూడా కనిపించకుండా పోయేలా ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు గా ఈ సమయంలో పని చేయడం అచ్చన్న కు ఇష్టం లేదు. ఈ కారణం చేతనే టిడిపి వ్యవహారాలు, కార్యక్రమాల విషయంలో అచ్చన్న దూరంగా ఉంటూ వస్తున్నారు.
Also Read : ఆళ్లగడ్డలో పాత గొడవలు మళ్లీరేగుతున్నాయా?
రెండు రోజుల క్రితం సొంత నియోజకవర్గం టెక్కలి కార్యకర్తలతో నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన అచ్చెన్నాయుడు కార్యకర్తలకు నాయకులకు పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు సంవత్సరాల తర్వాత సొంత నియోజకవర్గం నాయకులతో కార్యకర్తలతో సమావేశం అంటూ.. సందేశాలు పంపిన అచ్చన్న ఏదో చెబుతారు అని కార్యకర్తలు ఆశతో వచ్చారు. అయితే ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు ఆయన హితోపదేశము చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పార్టీ పరిస్థితి గురించి అచ్చెన్న ఈ సమావేశంలో తన మనసులోని మాటను బయటపెట్టినట్లు కొంతమంది నాయకులు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతుందని కార్యకర్తలు నాయకులు జాగ్రత్తగా ఉండాలని అచ్చెన్నాయుడు సమావేశంలో చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో తన కోసం పనిచేసిన వారు అందరినీ పలకరిస్తూనే ఎవరూ అనవసరంగా గ్రామాల్లో గొడవలకు దిగవద్దని, పార్టీ కోసం కేసులో ఇరుక్కోవద్దని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం చిన్న తప్పును సైతం వదిలే పరిస్థితి కనిపించడం లేదని అనవసరంగా కేసుల్లో ఇరుక్కుని జీవితాలు నాశనం చేసుకోవద్దు అంటూ అచ్చన్న చేసిన బోధ వచ్చిన క్యాడర్కు ఆశ్చర్యం అనిపించింది. గతంలో ఎప్పుడు ఏదో విషయం మీద గట్టిగా మాట్లాడే అచ్చెన్నాయుడు వైఖరి ఈసారి సమావేశంలో ప్రధాన చర్చనీయాంశం అయింది. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఎలా తయారైందో కూడా అచ్చం నాయుడు సొంత నియోజకవర్గం కార్యకర్తలకు చెప్పడం విశేషం. చంద్రబాబు వైఖరి, ఆయన రాజకీయ అవకాశం మీద మంచి పట్టు ఉన్న అచ్చెన్నాయుడు కీ ఈఎస్ఐ స్కాం బయటపడిన తర్వాత అసలు తత్వం అర్థమైంది. పార్టీ వైఖరి పూర్తిగా ఎలా ఉంటుందో ఒక రాష్ట్ర అధ్యక్షుడు మీద కేసు పెట్టిన చంద్రబాబు వైఖరి ఎలా మారుతుందో పూర్తిగా తెలుసుకున్న అచ్చెన్నాయుడు కిందిస్థాయి క్యాడర్ ను కాపాడుకునే క్రమంలో ఇప్పుడు దూకుడు తగ్గించడమే కాకుండా, రాజకీయ ప్రవచనాలు ఇవ్వడం టీడీపీ లో కాక రేపుతోంది.
Also Read : కొడుకుకు కుప్పం ఇచ్చి తండ్రి త్యాగం చేయనున్నారా?