iDreamPost
android-app
ios-app

డ్రగ్స్‌ కేసులో రకుల్‌ని ఇరికించాలనుకున్నదెవరు?

డ్రగ్స్‌ కేసులో రకుల్‌ని ఇరికించాలనుకున్నదెవరు?

డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే ఇండియన్‌ సినిమా నుంచి ముగ్గురు హీరోయిన్లు అరెస్టయ్యారు. రియా చక్రవర్తి బాలీవుడ్‌ నుంచి, సంజనతోపాటు రాగిణి ద్వివేది కన్నడ సినీ పరిశ్రమ నుంచి డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్న విషయం తెల్సిందే. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా అరెస్ట్‌ కాబోతోందంటూ పెద్దయెత్తున ప్రచారం జరిగింది. మీడియాకి ఇలాంటి వార్తలు మంచి కిక్‌ ఇస్తాయి. కానీ, రకుల్‌ మీద డ్రగ్స్‌ ఆరోపణలు రావడమేంటి.? అని చాలామంది ఆశ్చర్యపోయారు. దీని వెనుక పెద్ద కథే నడిచిందట. రకుల్‌ విషయంలో నేషనల్‌ మీడియా ఓవరాక్షన్‌ చేసిందనీ, ఆమె తీరు పట్ల అసహనంతో వున్న బాలీవుడ్‌ మీడియానే.. ఈ దుష్ప్రచారానికి తెరలేపిందనీ అంటున్నారు. నిజానికి మీడియాతో రకుల్‌ ఎప్పుడూ పాజిటివ్‌ ఆటిట్యూడ్‌తోనే వుంటుంది. కానీ, ఎక్కడో తేడా కొట్టింది. కావాలనే రకుల్‌ని ఈ కేసుతో లింక్‌ చేసి ఆమె మీద దుష్ప్రచారం చేశారట. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రకుల్‌, అలా తనను ఎవరు టార్గెట్‌ చేశారన్నదానిపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఈ కేసుతో రకుల్‌కి సంబంధం లేదని తేల్చాక, రకుల్‌ న్యాయ పోరాటం దిశగా సమాలోచనలు చేస్తోందని తెలుస్తోంది. రకుల్‌ మీద గతంలోనూ రకరకాల ఆరోపణలు వచ్చాయి. ఆయా సందర్భాల్లో ఆమె ఘాటుగా స్పందించింది కూడా. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ అయిన రకుల్‌, తన మీద దుష్ప్రచారం చేసిన ఓ కాంట్రవర్షియల్‌ మహిళపైనా చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోందని సమాచారం.