iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ OTT ఫినాలే – విజేత ఎవరు

  • Published May 18, 2022 | 5:44 PM Updated Updated May 19, 2022 | 6:40 PM
  • Published May 18, 2022 | 5:44 PMUpdated May 19, 2022 | 6:40 PM
బిగ్ బాస్ OTT ఫినాలే – విజేత ఎవరు

స్టార్ మా ఛానల్ లో అయిదు సీజన్ల పాటు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ షో ఓటిటి ద్వారా రెగ్యులర్ గా రన్ అవుతున్న సంగతి తెలిసిందే. టీవీ అంత ఆదరణ ఉందో లేదో రేటింగ్స్ కి సంబంధించిన సమాచారం స్పష్టంగా ఇవ్వడం లేదు కానీ ఫాలో అవుతున్న సంఖ్య బాగానే ఉందని సోషల్ మీడియా ట్రెండ్స్ ని బట్టి అర్థమవుతోంది. ఎప్పుడైనా చూసే వెసులుబాటు ఉండటం, ఇరవై నాలుగు గంటలు రన్ చేసే విధంగా డిజైన్ చేయడం ఈ గేమ్ వీరాభిమానులు ఆకర్షించింది. ఒకవేళ ఇప్పుడీ గేమ్ షో హాట్ స్టార్ ఓటిటికి భారీ సంఖ్యలో వ్యూస్ ని సబ్స్క్రైబర్స్ ని తెచ్చిందంటే సక్సెస్ అయినట్టే. ఒకవేళ కొనసాగించకపోతే ఫెయిలని చెప్పొచ్చు.

తాజాగా అందిన సమాచారం మేరకు ఈ బిగ్ బాస్ ఓటిటి ఫినాలే షో రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు షూట్ చేయబోతున్నారు. మొత్తం ఏడుగురు చివరి ఎపిసోడ్ బరిలో ఉన్నారు. బిందు మాధవి, అఖిల్ సార్థక్, అనిల్ రాథోడ్, మిత్రావ్ శర్మ, బాబా భాస్కర్, అరియనా గ్లోరీ, యాంకర్ శివలు తాడో పేడో తేల్చుకోబోతున్నారు. అక్కినేని నాగార్జున హోస్ట్ గా దీని షూటింగ్ జరగనుంది. ఫైనలిస్ట్ ల కుటుంబాలు కూడా దీనికి హాజరు కాబోతున్నాయి. అంతే కాదు పలువురు సినీ సెలెబ్రిటీలు వస్తారని తెలిసింది. పేర్లు బయటికి రాలేదు కానీ నాగ్ అండ్ స్టార్ మా పలుకుబడి ఎవరెవరిని తీసుకొస్తుందో చూడాలి. విన్నర్ ని మాత్రం స్పెషల్ గెస్ట్ ప్రకటిస్తారు.

ఈ బిగ్ బాస్ ఓటిటి ఈ ఏడాది ఫిబ్రవరి 26న లాంచ్ చేశారు. మొదట్లో 24 గంటల స్ట్రీమింగ్ అన్నారు కానీ మధ్యలో చాలా సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. ప్రసారాలకు అంతరాయం కూడా ఏర్పడింది. బ్రేక్ వచ్చింది. మొత్తం 17 కంటెస్టెంట్లను తీసుకొచ్చి వారియర్స్, ఛాలెంజర్స్ అంటూ రెండు గ్రూపులుగా విభజించారు. ముందుగా ఎలిమినేట్ అయ్యింది ముమైత్ ఖాన్ కాగా చివరిగా బయటికి వచ్చింది నటరాజ్ మాస్టర్. వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్ లోపలి వెళ్లిన బాబా భాస్కర్ చివరి దాకా ఉండటం ట్విస్ట్. మొత్తానికి రకరకాల మలుపులు తిరిగిన బిగ్ బాస్ ఓటిటి చివరి అంకంలోకి వచ్చింది. మరి విజేతగా ఎవరు నిలుస్తారో ఇంకో రెండు రోజుల్లో తేలనుంది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom