iDreamPost
iDreamPost
అంబానీ ఫ్యామిలీకిచెందిన రాధిక మర్చెంట్(Radhika Merchant) ఒక్కసారిగా నేషనల్ మీడియాకు హెడ్ లైన్ అయిపోయారు. ఈ క్లాసికల్ డాన్సర్ ఆదివారం అరెంగ్రేటం చేశారు. ముఖేష్ అంబానీ కుటుంబం (Mukesh Ambani)తోపాటు మర్చెంట్ కుటుంబానికి ఇదో వేడుక.
క్లాసికల్ డాన్స్ లో అరెంగ్రేటం(Arangetram ) చేయాలంటే గురువు దగ్గర 8 ఏళ్లు శిష్యరికం చేయాలి. ఇక రాధిక మర్చెంట్ (Radhika Merchant) ప్రదర్శన ఇంటర్నెట్ ను తుఫాన్ లా కమ్మేసింది.
ఎవరీ రాధిక మర్చెంట్? ముఖేష్ అంబానీ, నీతా అంబానీకి కాబోయే కోడలు, బిలియనీర్ విరేన్ మర్చెంట్ ( Viren Merchant) కూతురు ఎందుకు ఇంటర్నెట్ లో సన్సేషన్ అయ్యారు? రాధిక మర్చెంట్, వీరెన్ మర్చెంట్, శైలా మర్చెంట్ కూతరు. ఆమె తండ్రి ప్రైవేట్ రంగంలో పేరున్న ఫార్మా గ్రూప్ ఎన్ కోర్ హెల్త్ కేర్ కి సీఈఓ.
రాధిక మర్చెంట్ ముంబైలోని Cathedral , John Connon Schools, École Mondiale World Schoolలో చదువుకున్నారు. New York University లో పాటిటిక్స్, ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు.
భరతనాట్యంలో ఆమెకు మొదటి నుంచి ఆసక్తి. అందుకే భావన థాకర్ దగ్గర శిష్యరికం చేశారు. శ్రీ నిర్భ ఆర్ట్స్( Shree Nibha Arts)లో నాట్యం నేర్చుకున్నారు. ఆమె అరెంగ్రేటం కోసం ముంబైలోని జియో వోల్డ్ సెంటర్ ని సిద్ధం చేశారు. ఈ ప్రదర్శనకు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్ లాంటి సెలబ్రిటీలు హాజరైయ్యారు. మహారాష్ట్ర మంత్రి ఆధిత్య థాకరే కుటుంబంతో సహా వచ్చారు. అనీల్ అంబానీ( Anil Ambani) ఆకాశ్ అంబానీ, శ్లోక అంబానీలు ఈ ప్రదర్శనకు వచ్చారు.
అంబానీ కుటుంబంలో నీతా అంబానీ తర్వాత శాస్త్రీయనృత్యంలో శిక్షణ పొందిన రెండో వ్యక్తి రాధిక మర్చెంట్.