iDreamPost
android-app
ios-app

క్రికెటర్ కావలసినోడు ఎమ్మెల్సీ అయ్యాడు

క్రికెటర్ కావలసినోడు ఎమ్మెల్సీ అయ్యాడు

డాక్టర్ కాబోయి యాకర్ట్ అయ్యానని చెప్పటం సినీ పరిశ్రమలో చాలా ఎక్కువ. ఎన్నో రంగాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అనేకమంది క్రీడాకారులు రాజకీయాల్లో చేరి పెద్ద పదవులు చేపట్టారు.గౌతమ్ గంభీర్ లాంటి మాజీ క్రికెటర్ ఇప్పుడు బీజేపీ తరుపున ఎంపీగా గెలిచాడు. అజారుద్దీన్, సిద్దు ఇలా అనేక మంది క్రికెటర్ లో రాజకీయాల్లో రాణించారు.

ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్ అయినా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్ధీ అవుతాడని భావించిన కౌశిక్ రెడ్డి కూడా పేరున్న క్రికెటర్. టిఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు హైదరాబాద్ రంజీ జట్టులో క్రికెటర్ కెరీర్ ప్రారంభించిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు రాజకీయాల వైపు వచ్చారు.

1984లో జన్మించిన కౌశిక్ రెడ్డికి చదువుకునే రోజుల్లో క్రికెట్ మీద ఉన్న అసక్తితో క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 2004 నుండి 2007 మధ్యలో మంచి ఆటతీరు కనబరిచిన కౌశిక్ హైదరాబాద్ రంజీ జట్టులో చోటు సాధించాడు. టీం ఇండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్, అంబటి రాయుడు, మురళీ విజయ్, దినేష్ కార్తీక్, సురేష్ రైనా, ప్రజ్ఞాన్ ఓజా, అశ్విన్, కౌశిక్ రెడ్డి సహచరులే. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన కౌశిక్ రెడ్డి 299 పరుగులు చేసాడు. 2006లో ధులిప్ ట్రోఫీలో శ్రీలంకతో జరిగిన మ్యాచులో బౌలింగ్ లో కూడా మంచి ఆట కనబరిచాడు. 31 పరుగులకు 6 వికెట్ల తీసిన రికార్డ్ కూడా ఉంది. బ్యాటింగ్ లో 40 నాటౌట్ గా నిలిచాడు.

అయితే 2006లో ఆస్ట్రేలియా టూర్లో సెలెక్ట్ టీంలో మంచి ఫామ్ లో ఉన్న తన బదులు ఆర్పీ సింగ్ ను ఎన్నిక చేయడంతో కౌశిక్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సెలెక్టర్ శివలాల్ యాదవ్ మీద విమర్శలు చేసాడు. ఈ సమయంలో కపిల్ దేవ్, సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో వచ్చిన ఇండియన్ క్రికెట్ లీగ్ ప్రారంభం అయింది. కపిల్ దేవ్ స్వయంగా కౌశిక్ రెడ్డి, అంబటి రాయుడుతో మాట్లాడడంతో ఆస్ట్రేలియా టూర్ కి సెలెక్ట్ కాకపోవడంతో 21 ఏళ్లలో ఆ ప్రస్టేషన్ లో ICL లో జాయిన్ అయ్యాడు. తరువాత మూడేళ్ళు ICL లో ఆడాడు కౌశిక్. తరువాత ICL ఐపీఎల్ లో విలీనం కావడంతో మళ్లీ శివలాల్ యాదవ్ కింద ఆడడం ఇష్టం లేక క్రికెట్ ను వదిలేసాడు కౌశిక్. క్రికెట్ వదిలేయకపోతే టీం ఇండియాకు ఆడేవాడినని పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు.

క్రికెట్ వదిలేసాక రాజకీయాల్లో ఉన్న తండ్రి బాటలో నడిచారు. శ్రీధర్ బాబు ద్వారా వైఎస్ రాజశేఖరరెడ్డికి పరిచయం అయ్యాడు. 2009 ఎన్నికల్లో హుజురాబాద్ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ పలు కారణాలతో టికెట్ కౌశిక్ కు దక్కలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత మారిన రాజకీయ సమీకరణాలతో కౌశిక్ కు ప్రాధాన్యత తగ్గింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ లోనే కొనసాగిన కౌశిక్ రెడ్డికి అయన బంధువు ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. హుజురాబాద్ లో 61,121 ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు. తాజాగా ఉప ఎన్నిక వేల గులాబీ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు.

Also Read : పదవుల పంట.. కారును గమన్యానికి చేర్చునా..?