iDreamPost
android-app
ios-app

ఆజాద్ తర్వాత ఎవరో మరి.. ?

ఆజాద్ తర్వాత ఎవరో మరి.. ?

కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇబ్బంది వచ్చిపడింది. రాజ్యసభలో ఇప్పటివరకు బీజేపీను నిలువరించిన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ పక్ష నేత గులాబ్ నబీ ఆజాద్ స్థానంలో ఎవరిని నియమించాలి అన్న విషయంలో పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు పెద్దల సభలో సరైన వ్యక్తి కోసం కాంగ్రెస్ వేట మొదలు పెట్టింది. అజాతశత్రువు గా ఉండే వ్యక్తి, విషయం పై పట్టు ఉన్న వ్యక్తి, బీజేపీని అడ్డుకోగల, ఆడుకోగల వ్యక్తి అయితే బాగుంటుంది అన్నది ఆ పార్టీ అభిప్రాయం.

15తో పూర్తి…

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యుడిగా ఈనెల 15వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన బాధ్యతలు ఇప్పుడు ఎవరికి అప్పగిస్తారని విషయం ఆసక్తిగా మారింది. దీనిపై సరైన వ్యక్తిని ఎంపిక చేయాలంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కొందరు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. గులాం నబీ అజాద్ సభ నుంచి బయటకు వచ్చే సమయానికి నేత ఎంపిక పూర్తి కావాలనేది సోనియా ఆలోచన.

మొదటి వరుసలో వీరు!

వీరిలో మొదటగా మల్లికార్జున ఖర్గే, ఆనంద్ శర్మ, చిదంబరం, దిగ్విజయ్ సింగ్, తమిళ్ కపిల్సిబల్ వంటి కీలక నేతలు ఉన్నారు. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే ఆజా తర్వాత స్థానంలో ఉన్న ఆనంద్శర్మ ప్రస్తుతం రాజ్యసభ లో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇటీవల పార్టీలో సంస్కరణలు అవసరం అంటూ ఆనంద్ శర్మ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. దీంతో ఆయన మీద సోనియా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆనం శర్మకు రాజ్యసభ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం సందేహమేనని తెలుస్తోంది.

దిగ్విజయ్ లేదా ఖర్గే!

ఆనంద్ శర్మ తర్వాత స్థానంలో దిగ్విజయ్సింగ్ కనిపిస్తున్నారు. ఈయన ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి, సోనియాకు నమ్మినబంటు. దీంతోబాటు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కు సైతం పదవి అప్పగించే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాహుల్ గాంధీ తో ను ఉన్న సాన్నిహిత్యం మల్లికార్జున ఖర్గేకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. బలమైన వానీతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టగల సామర్థ్యం ఉన్న ఆయనకు సైతం పదవి ఇవ్వవచ్చని ఢిల్లీ సర్కిల్లో చర్చ జరుగుతోంది. అయితే ఏప్రిల్ నాటికి కేరళకు చెందిన మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిలో ఒకటి కాంగ్రెస్ కి దక్కుతుంది. దీంతో ఆ స్థానంలో మల్లోసారి ఆజాద్ ను రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయని ఊపందుకున్నాయి.