iDreamPost
android-app
ios-app

చిరు బాలయ్య – వచ్చేది ఒక్కరే

  • Published Oct 07, 2022 | 5:58 PM Updated Updated Oct 07, 2022 | 5:58 PM
  • Published Oct 07, 2022 | 5:58 PMUpdated Oct 07, 2022 | 5:58 PM
చిరు బాలయ్య – వచ్చేది ఒక్కరే

ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ 2023 సంక్రాంతి అప్పుడే వేడెక్కుతోంది. ప్రస్తుతానికి ఆ పండక్కు మూడు సినిమాలు రావడం కన్ఫర్మ్ అయ్యింది. మొదటిది చిరంజీవి వాల్తేర్ వీరయ్య. ఇది ఎప్పుడో నెలల క్రితమే ప్రకటన చేసుకుంది. రెండోది విజయ్ వారసుడు. పొంగల్ సీజన్ కు రావాలనే పట్టుదలతో షూటింగ్ వేగంగా చేస్తున్నారు. మూడోది ఇటీవలే ప్రకటించిన ప్రభాస్ ఆది పురుష్. దేనికవే ఆయా హీరోల కెరీర్లో క్రేజీ ప్రాజెక్టులు కావడంతో అభిమానుల అంచనాలు మాములుగా లేవు. బిజినెస్ ఆఫర్స్ భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటికి థియేటర్లను కేటాయించడమే డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సవాల్. అలాంటిది మరో క్రేజీ మూవీ ఊహించుకోగలమా.

లేటెస్ట్ టాక్ ప్రకారం బాలకృష్ణ 107వ చిత్రం సైతం ఈ సీజన్ కే దింపాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి దీనికి ఫిక్స్ చేసుకున్న డేట్ డిసెంబర్ 23. అఖండ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ మొదటి వారమే అనుకున్నారు కానీ ఆ టైంకంతా ఫస్ట్ కాపీ సిద్ధం చేయడం కష్టమే. అందుకే దానికి బదులుగా క్రిస్మస్ సమయం బెస్ట్ అని భావించడంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని లీక్ వచ్చింది. అయితే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఊర మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా సంక్రాంతి అయితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఫ్యాన్స్ కోరుకుంటున్నది కూడా అదే. దీపావళికి టైటిల్ అనౌన్స్ చేసేలోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ ప్రాక్టికల్ గా చూస్తే చిరంజీవి బాలయ్యలో ఒకరితో ఒకరు క్లాష్ అయ్యే ఛాన్స్ ఈసారి మాత్రం లేదు. ఎందుకంటే వాల్తేర్ వీరయ్య, NBK 107 రెండింటికి నిర్మాత ఒకరే మైత్రి మూవీ మేకర్స్. అలాంటిది తమ సినిమాతో తామే పోటీ పెట్టుకునే సాహసం చేయరు. బయ్యర్లు కూడా వద్దనే చెబుతారు. సో బాలకృష్ణ ముందుగా రావడం సబబని అంతర్గతంగా వినిపిస్తున్న అభిప్రాయం. ఒకవేళ చిరు మూవీ ఆలస్యమయ్యే పక్షంలో అప్పుడు రూట్ క్లియర్ అవుతుంది. ఇప్పటికైతే ఇది సస్పెన్స్ గానే ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు నువ్వా నేనా అని తలపడిన చిరు బాలయ్యలు ఆఖరిసారి ఖైదీ నెంబర్ 150-గౌతమీపుత్ర శాతకర్ణికి క్లాష్ అయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం కుదరదు

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş