రానా సినిమాకు మోక్షం ఎప్పుడు

సెకండ్ లాక్ డౌన్ అయిపోయింది. థియేటర్లు తెరుచుకుని ఇప్పటికే రెండు నెలలు దాటేసింది. అయినా కూడా కొన్ని సినిమాల విడుదల విషయంలో కనీస అప్ డేట్స్ రావడం లేదు. అందులో విరాట పర్వం ఒకటి. నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందించిన ఈ సోషల్ మెసేజ్ ఎంటర్ టైనర్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఇంకొక్క రోజు చేస్తే అయిపోతుందని ఆ మధ్య సాయి పల్లవి, రానాలు చెప్పారు కానీ అది పూర్తి చేశారో లేదో ఇప్పటిదాకా యూనిట్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. నిర్మాత సురేష్ బాబు నారప్ప టైంలో ఓ రెండు ముక్కలు మాట్లాడారు తప్ప ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా దాటేశారు.

కరోనాకు ముందు ఆగిపోయిన సినిమాలన్నీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతున్న తరుణంలో ఒక్క విరాట పర్వంకు మాత్రమే ఎందుకు సమస్య వచ్చిందనేది అంతు చిక్కడం లేదు. ఆ మధ్య ఓటిటి రిలీజ్ అన్నారు. తర్వాత లేదూ థియేటర్లకే వస్తామని దర్శకుడు అన్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఎవరూ మాట్లాడ్డం లేదు. సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి కూడా మారారని అతని స్థానంలో హర్షవర్ధన్ రామేశ్వర్ వచ్చారనే ప్రచారం జరిగింది కానీ దాని గురించీ మౌనమే సమాధానం అయ్యింది. మొత్తానికి విరాట పర్వం మీద ఏర్పడ్డ సందిగ్దత త్వరగా వీడాలని దగ్గుబాటి అభిమానులు కోరుకుంటున్నారు.

ఇటీవల లవ్ స్టోరీ సక్సెస్ వల్ల సాయి పల్లవి ఇమేజ్ విరాట పర్వంకు బిజినెస్ పరంగా హెల్ప్ కాబోతోంది. అయితే ఇప్పటి తరానికి అంతగా అవగాహన లేని నక్సలైట్ బ్యాక్ డ్రాప్ ని ఎంతమేరకు ఆసక్తికరంగా కన్విన్సింగ్ గా చెప్పారన్నది వేచి చూడాలి. ప్రియమణి, నందిత దాస్ లాంటి క్యాస్టింగ్ అంచనాలు పెంచుతోంది. ఇదే కాదు దృశ్యం 2 కూడా ఇంచుమించు ఇదే పరిస్థితిని ఎదురుకుంటోంది. థియేటర్ అని ఒకసారి ఓటిటి అని మరోసారి రెండు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏదో ఒకటి సురేష్ బాబు తేల్చి చెబితే బెటర్. చాలా కష్టపడి చేసిన అరణ్య డిజాస్టర్ తర్వాత రానా ఆశలన్నీ ఇప్పుడు దీని మీదే ఉన్నాయి

Also Read : మెగా మూవీ ప్లానింగ్ మారిపోయింది

Show comments