iDreamPost
android-app
ios-app

రానా నాయుడులోని ఈ నటి ఎవరో తెలుసా? ఊహించని బ్యాగ్రౌండ్!

  • Published Sep 03, 2024 | 12:53 PM Updated Updated Sep 03, 2024 | 12:53 PM

వెంకీ, రానా తండ్రీకొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఇందులో విపరీతమై శృంగార సన్నివేశాలున్నాయని, అసభ్య పదజాలం ఉందని మహిళా ప్రేక్షకులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాగా, ఇందులో రానాను ఫ్లట్ చేసే ఈ క్యారెక్టర్ గుర్తుందా..?

వెంకీ, రానా తండ్రీకొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ఇందులో విపరీతమై శృంగార సన్నివేశాలున్నాయని, అసభ్య పదజాలం ఉందని మహిళా ప్రేక్షకులు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాగా, ఇందులో రానాను ఫ్లట్ చేసే ఈ క్యారెక్టర్ గుర్తుందా..?

  • Published Sep 03, 2024 | 12:53 PMUpdated Sep 03, 2024 | 12:53 PM
రానా నాయుడులోని ఈ నటి ఎవరో తెలుసా? ఊహించని బ్యాగ్రౌండ్!

కుటుంబ కథా చిత్రాల నాయకుడు, మహిళా అభిమానుల మనసు చూరగొన్న నటుడు విక్టరీ వెంకటేష్. సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఆయనపై ఎలాంటి రిమార్క్ లేదు. కానీ తన సరిహద్దు చెరిపేసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. కొడుకు రానాతో కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్‌లో ఎన్నడూ చూడని వెంకీని చూస్తారు. గత ఏడాది మార్చిలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ పై మహిళల నుండి విపరీతమైన నెగిటివిటీని మూటకట్టుకుంది. మితి మీరిన శృంగార సన్నివేశాలు, అసభ్య పదజాలం ఉన్నాయని విమర్శలు గుప్పించేలా చేసింది. అయినప్పటికీ.. ఈ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం గమనార్హం. ఇందులో సెలబ్రిటీలకు ప్రాబ్లమ్ వస్తే హెల్ప్ చేసే పాత్రలో మెప్పించాడు రానా. ఇక ఇందులో ఓ నిర్మాతకు ప్రాబ్లమ్ రాగా అక్కడకు వెళతాడు హీరో. తనతో ఉంటున్న నటి మందిరా శర్మ.. మరొకరితో ఎఫైర్ పెట్టుకుందేమో కనుక్కోమని చెబుతాడు నిర్మాత.

మందిరా శర్మపై నిఘా పెట్టిన రానాతో ఎఫైర్ పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఆ భామ. ఈ ఇద్దరి మధ్య కూడా కొన్ని బోల్డ్ సన్నివేశాలుంటాయి. ఇంతకు ఆ నటి ఎవరో తెలుసా..? ప్రియా బెనర్జీ. రానా నాయుడు వెబ్ సిరీస్ లో పరవర్టెడ్ రోల్ ప్లే చేస్తుంది. రానాను వశపరుచుకునేందుకు ఆమె చేయని ప్రయత్నం ఉండదు. ఈ బోల్ట్ బ్యూటీ.. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ నుండే గ్లామరస్ షో చేస్తూ ఆకట్టుకుంది. బెంగాలీ పేరెంట్స్‌కు కెనడాలో పుట్టిన ఈ భామ.. తెలుగు మూవీతోనే సినీ కెరీర్‍ను స్టార్ట్ చేయడం విశేషం. అడవి శేష్ తనను తాను హీరోగా పరిచయం చేసుకుంటూ తెరకెక్కించిన మూవీనే కిస్. ఈ చిత్రంతోనే తెరంగేట్రం చేసిందీ బ్యూటీ. 2013లో విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఆమె సందీప్ కిషన్ హీరోగా వచ్చిన జోరు చిత్రంలో యాక్ట్ చేసింది. నారా రోహిత్ అసుర చిత్రంలో కనిపించింది.

తెలుగు సినిమాలు తనకు అచ్చి రాలేదో లేక ఆఫర్స్ రాలేదో తెలియదు.. కానీ మకాం ముంబయికి మార్చింది. జబ్బా చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడే వరుస పెట్టి చిత్రాలు చేసింది. ఓ తమిళ చిత్రం చేసిన ఈ బ్యూటీ.. సినిమాల కన్నా వెబ్ సిరీస్‌లతోనే పేరు తెచ్చుకుంది. బారీష్, హెల్లో మినీతో సహా తెలుగులో 11th అవర్, రానా నాయడు (బైలింగ్వల్), సిరీస్‌తో ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలతో కన్నా సిరీస్ లతోనే బిజీగా ఉంది. ఇక రానా నాయుడు 2కూడా త్వరలో రాబోతుంది. ఇందులో తన పాత్ర కంటిన్యూ కానుంది. ప్రముఖ నటి స్మితా పాటిల్, రాజ్ బబ్బర్ తనయుడు ప్రతీక్ బబ్బర్‌తో రిలేషన్‌లో ఉంది ఈ బ్యూటీ. ఈ ఏడాది జనవరిలో ఈ ఇద్దరు ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆమె పెట్టే పిక్స్ సెగలు పుట్టిస్తుంటాయి.

 

View this post on Instagram

 

A post shared by Shivaji Storm Sen (@stormshivajisen)

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş