iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కెరీర్లో కొత్త జానర్ తో ప్రేక్షకుల ముందుకు రానా!

  • Published Aug 15, 2024 | 1:24 PM Updated Updated Aug 15, 2024 | 1:24 PM

Rana Daggubati New Project With Horror Element: రానా దగ్గుబాటి దాదాపుగా రెండేల్ల తర్వాత కొత్త ప్రాజెక్ట్ గురించి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అంటున్నారు. అది కూడా ఒక కొత్త జానర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడంట.

Rana Daggubati New Project With Horror Element: రానా దగ్గుబాటి దాదాపుగా రెండేల్ల తర్వాత కొత్త ప్రాజెక్ట్ గురించి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అంటున్నారు. అది కూడా ఒక కొత్త జానర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడంట.

  • Published Aug 15, 2024 | 1:24 PMUpdated Aug 15, 2024 | 1:24 PM
ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కెరీర్లో కొత్త జానర్ తో ప్రేక్షకుల ముందుకు రానా!

పాన్ ఇండియా లెవల్లో ఉన్న అతి తక్కువ విలక్షణమైన నటుల లిస్టులో రానా దగ్గుబాటి పేరు కచ్చితంగా ఉంటుంది. మీకు హీరోగా చేయడం ఇష్టమా? విలన్ గా చేయడం ఇష్టమా అంటే? నాకు ఆర్టిస్టు అవ్వడం ఇష్టం అంటాడు. అంటే ఏం చేస్తున్నాం అన్నది ఆయనకు ముఖ్యం కాదు. ఎంత గొప్ప పాత్ర చేస్తున్నాం అన్నదే ముఖ్యం. ఎంతసేపు కనిపించినా కూడా ఆ పాత్ర మాత్రం ప్రేక్షకులకు గుర్తుండిపోవాలి అనుకుంటాడు. అనుకున్నట్లుగానే రానా తన కెరీర్లో ఇప్పటి వరకు అలాంటి పాత్రలు చాలానే చేశాడు. హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ రోల్స్, క్యామియో అప్పియరెన్సులు, హోస్ట్ గా కూడా ప్రేక్షకులను మెప్పించాడు. అయితే కెరీర్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన రానా ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని తెలుస్తోంది.

రానా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు. గత రెండేళ్లలో రానా నాయుడు సిరీస్ తప్పింతే మరో రిలీజ్ లేదు. ఎలాంటి ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అనే విషయం కూడా ఫ్యాన్స్ కి తెలీదు. అసలు ఏం చేస్తున్నాడు అనే విషయం కూడా తెలియక అభిమానులు కాస్త తికమకగానే ఉన్నారు. పాన్ ఇండియా లెవల్లోనే బిజీ బిజీగా ఉండే రానా ఇంత ఖాళీగా ఉండటం ఏంటి అని అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు రానా ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అందుతోంది. రానా దగ్గుబాటి తన కొత్త సినిమా కోసం సన్నద్ధం అవుతున్నాడంట. ఇప్పటికే కథ, దర్శకుడు ఓకే అయిపోయినట్లు చెబుతున్నారు. ఒక కొత్త దర్శకుడితో రానా తన తర్వాతి ప్రాజెకట్ చేయబోతున్నాడు అంటున్నారు.

rana with new director

రానా దగ్గుబాటి కొత్త దర్శకుడితో రావడమే కాకుండా.. ఒక కొత్త జానర్ ట్రై చేయబోతున్నాడు అంటున్నారు. హారర్ టచ్ ఉన్న కథతో రానా కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అంట. ఇక్కడ ఇంకో విశేషం ఏంటి అంటే.. ఆ మూవీని ప్రొడ్యూస్ చేయబోయేది బాహుబలి నిర్మాతలు అంటున్నారు. కొన్ని సినిమాలు తర్వాత ఆర్కా మీడియా మరో భారీ బడ్జెట్ చిత్రానికి సిద్ధమైందని టాక్. అది కూడా రానాతో ఒక కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఇంక ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే బాలీవుడ్ లో కూడా రానాకి మంచి మార్కెట్ ఉంది. అందుకే ఇది పాన్ ఇండియా అవుతుంది అనడంలో సందేహం లేదు. మరి.. రానా దగ్గుబాటి కొత్త డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş