iDreamPost
android-app
ios-app

Nandamuri Mokshagna : జూనియర్ బాలయ్య రంగప్రవేశం ఎప్పుడు

  • Published Nov 27, 2021 | 6:56 AM Updated Updated Nov 27, 2021 | 6:56 AM
  • Published Nov 27, 2021 | 6:56 AMUpdated Nov 27, 2021 | 6:56 AM
Nandamuri Mokshagna : జూనియర్ బాలయ్య రంగప్రవేశం ఎప్పుడు

ఆహా కోసం నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో తాజా ఇంటర్వ్యూ షూటింగ్ సెట్ లో మోక్షజ్ఞ కనిపించాడన్న వార్త అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. గెస్ట్ అతనేనా అనే కోణంలో కూడా ప్రచారం జరిగింది. అక్కడికి వచ్చింది నిజమే కానీ అది పాల్గొనేందుకు కాదని తెలిసింది. కేవలం నాన్నకు తోడుగా మాత్రమే వచ్చాడని అంతకు మించి మరే కారణం లేదని అంటున్నారు. ఒక యూత్ హీరో, పేరు మోసిన కమెడియన్ తో నెక్స్ట్ ఎపిసోడ్ ఉంటుందనే లీక్ వచ్చింది కానీ వాళ్ళు ఎవరు అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. మంచు ఫ్యామిలీ, న్యాచురల్ స్టార్ నాని ఎపిసోడ్స్ కు వచ్చిన రెస్పాన్స్ చూశాక ఆహా వేగం ఇంకా పెంచనుంది.

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానుల ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆదిత్య 999తో తన స్వంత దర్శకత్వంలో లాంచ్ చేస్తానని గతంలో బాలకృష్ణ అన్నారు కానీ ప్రస్తుతానికి ఆ సూచనలు కనిపించడం లేదు. వరసగా సినిమాలు చేస్తుండటమే దానికి కారణం. గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ అయ్యాక అనిల్ రావిపూడి మూవీ తెరకెక్కుతుంది. ఈ రెండు అయ్యేలోగా 2022 పూర్తవ్వడం ఖాయం. ఆపైన కూడా డైరెక్టర్ల క్యూ కొనసాగుతోంది. మరి ఇంత టైట్ ప్లానింగ్ లో సెల్ఫ్ డైరెక్షన్ ఎలా సాధ్యమో అంతు చిక్కడం లేదు. స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని అంటున్నారు కానీ ఖరారుగా అర్థం చేసుకోలేని పరిస్థితి. ఇదంతా మూడునాలుగేళ్ళుగా సాగుతున్న వ్యవహారం.

నందమూరి మూడో తరం వారసుల్లో ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే స్టార్ స్థాయికి చేరుకున్నారు. మిగిలిన వాళ్ళు ప్రయత్నాలు చేశారు కానీ అవి ఫలించలేదు. అందుకే మోక్షజ్ఞ వస్తే ఈ కుటుంబం నుంచి మరో హీరోకు మార్కెట్ వస్తుందనే నమ్మకంతో అభిమానులున్నారు. అతనికి నటన మీద ఆసక్తి లేదనే టాక్ కూడా గతంలో వచ్చింది. అదెంతవరకు నిజమో తెలియదు. ఫిజిక్ కూడా హీరో మెటీరియల్ కు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నట్టు కనిపించడం లేదు. కొడుకు సంగతి ఎలా ఉన్నా బాలయ్య మాత్రం ఇప్పటి జెనరేషన్ హీరోలతో పోటీ పడుతూ మరీ సినిమాలు చేస్తున్నారు. డిసెంబర్ 2 రాబోతున్న అఖండ మీద అంచనాలు మాములుగా లేవు

Also Read : Cauliflower : క్యాలిఫ్లవర్ రిపోర్ట్

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom