iDreamPost
iDreamPost
వాట్సాప్.. భారత్ సహా ప్రపంచ దేశాలు ఎక్కువగా ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్. వాట్సాప్ వచ్చిన తొలి రోజుల్లో కేవలం మెసేజ్ లు పంపించడం వరకే పరిమితం. ఆ తర్వాత ఫొటో స్టేటస్, టెక్ట్స్ స్టేటస్, 15 సెకండ్లు, 30 సెకండ్ల వీడియో స్టేటస్, డిజిటల్ పేమెంట్స్.. మెసేజ్ డిలీట్ ఆప్షన్.. ఇలా ఒక్కో ఫీచర్ ను అప్ డేట్ చేస్తూ వచ్చింది. తాజాగా వినియోగదారులకోసం వాట్సాప్ మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఇప్పటి వరకూ వాట్సాప్ లో పంపించే మెసేజ్ లలో ఎడిట్ ఆప్షన్ లేదు. కానీ.. ఇప్పుడు ఆ వెసులుబాటు కల్పిస్తోంది వాట్సాప్. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉందనని, త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది వాట్సాప్ సంస్థ. మెసేజ్ పంపిన తర్వాత ఎడిట్ చేయడం వల్ల.. పాత వెర్షన్ కనిపించకుండా కూడా చేసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.