iDreamPost
android-app
ios-app

గౌరు కుటుంబం పోగొట్టుకుంది కేవలం పదవి మాత్రమేనా..?

గౌరు కుటుంబం పోగొట్టుకుంది కేవలం పదవి మాత్రమేనా..?

రాజకీయాల్లో హత్యలుండవు … ఆత్మ హత్యలు మాత్రమే ఉంటాయనడానికి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కర్నూలు జిల్లాకు చెందిన గౌరు వెంకటరెడ్డి రాజకీయ జీవితం పెద్ద ఉదాహరణ.

నంది కొట్కూరు నియోజకవర్గంలో తృతీయ శ్రేణి నాయకుడిగా ఉన్న బ్రాహ్మణ కొట్కూరు కు చెందిన జిన్ను (గౌరు)జనార్దన రెడ్డి కుమారుడైన గౌరు వెంకటరెడ్డికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కారకూడన్నది జగమెరిగిన సత్యం. జంట హత్య కేసులో కింది కోర్టులో యావజ్జివ శిక్ష పడి హైకోర్టులో 10 ఏళ్ల జైలు గా శిక్ష తగ్గింపు పొందిన గౌరు వెంకటరెడ్డి అప్పటి ముఖ్య మంత్రి వైఎస్సార్ ఇచ్చిన ప్రత్యేక జీవో ద్వారా విడుదలయ్యారు. అంతే కాకుండా ఆయన భార్య గౌరు చరితకు రెండు సార్లు (2004లో నందికొట్కూరు, 2009లో పాణ్యం నుంచి) పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించడం ద్వారా వైఎస్ రాజశేఖరరెడ్డి గౌరు కుటుంభం పై అపార మైన ఆదరం చూపారు. జైలు జీవితం గడుపుతున్న గౌరు వెంకటరెడ్డి ని చూడడానికి వెళ్లిన వైఎస్ రాజశేఖరరెడ్డి విమర్శలెదుర్కొన్నారు కూడా.

Also Read:మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ముగ్గురు సోదరులు .. మూడు పార్టీలు

రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా గౌరుపై ఆదరం ఏమాత్రం తగ్గించలేదు. ఎందరో సీనియర్లను కాదని వెంకటరెడ్డిని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమించారు. 2014 ఎన్నికలలో గౌరు చరితకు పాణ్యం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. ఇంతలా ఆదరం చూపిన వైస్ కుటుంబానికి బాసటగా నిలవాల్సిన గౌరు వెంకటరెడ్డి ఆ తరువాత వ్యవహరించిన తీరు జనం ముక్కుమీద వేలేసుకునేలా చేసింది. అంతిమంగా ఈ వ్యవహారం ఆయన రాజకీయ ఆత్మహత్యగానే పరిణమించింది.

తన అక్క ఉమ భర్త అయిన శివానందరెడ్డి రాజకీయవసరాలకోసమే గౌరు ఈ వ్యవహారానికి పాల్పడ్డారు. నిజానికి కర్నూలు జిల్లా జెడ్పిటిసిలలో మెజారిటీ ఉన్నప్పటికీ 2014లో జెడ్పి చైర్మన్ పదవి ని వైఎస్ఆర్ సిపి కోల్పోవడం వెనుక అప్పటికే టిడిపిలో చేరిన గౌరు బావ శివానందరెడ్డి షడ్యత్రం ఉన్న విషయం, అందుకు వెంకటరెడ్డి వ్యూహాత్మకమౌనం అందరికి తెలిసిన విషయమే. అటు పిమ్మట వైఎస్ఆర్ సిపి తరపున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట రెడ్డి పోటీ చేసి ఓటమి చెందిన తరువాత తను బావ మార్గంలో టిడిపి గూటికి చేరాడు.

Also Read : విశాఖ రాజ‌ధానిపై చంద్రబాబుది రెండు కళ్ళ సిద్ధాంతమేనా?

2019 ఎన్నికల్లోటిడిపి అది నాయకత్వం వెంకట రెడ్డి బావ శివానందరెడ్డి కి నంద్యాల ఎంపీ, తన భార్య గౌరు చరితకు పాణ్యం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పటికీ జగన్ ప్రభంజనంలో వారు ఓడిపోయారు. ఆ తరువాత జిల్లాలో శల్యావసిస్టం అయిన తెలుగు దేశం పార్టీలో కొనసాగుతున్న గౌరు వెంకటరెడ్డి అలా వైఎస్సార్ సీపీ కి దూరమవడం వల్ల పవర్ ను కో ల్పోవడమే కాకుండా నమ్మిన వారికి తగిన ఆలంబన ఇవ్వడంలో దేశంలోనే పేరుగాంచిన వైఎస్ కుటుంబ ఆదరణను కూడా కోల్పోయి రాజకీయంగా అధ:పాతాళానికి చేరుకున్నారు.

గౌరు వెంకటరెడ్డి తండ్రి జనార్ధనరెడ్డి మాజీ మంత్రి బైరెడ్డి శేషశయనారెడ్డి అనుచరుడిగా కొనసాగారు. శయానా రెడ్డి మరో అనుచరుడైన మాండ్ర గిడ్డారెడ్డి కుమారుడైన శివానందరెడ్డికి తన కుమార్తె ఉమను ఇచ్చి వివాహం చేశాడు. అయితే ఒక సందర్భంలో శేషశయణారెడ్డి అనుచరుడైన ఆర్లపాటి రామిరెడ్డి స్వపక్షంలోని జనార్దన రెడ్డి పై ప్రాణాంతక దాడి చేయించాడు. దీంతో అధినాయకుని కి తెలియకుండా ఈ దాడి జరిగి ఉండదని భావించిన జనార్దన రెడ్డి ఆ గ్రూపుకు దూరంగా ఉన్నాడు. అప్పట్లో నందికొట్కూరులో న్యాయవాదిగా ఉన్న డీ .రఘుస్వామిరెడ్డి ప్రోద్బలంతో జనార్దన రెడ్డి మద్దూరు సుబ్బారెడ్డి వర్గంలో చేరాడు. అలా గౌరు వెంకటరెడ్డి కుటుంభం ఎదో ఒక గ్రూపులో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులుగా కొనసాగారు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ఆదరణతో జిల్లాలో వెంకటరెడ్డి కుటుంభం అగ్రశ్రేణి నాయకత్వ స్థాయికి ఎదిగింది. వైఎస్ఆర్ సీపీకి దూరమై రాజకీయ గ్రహణాన్నీ తెచ్చుకుంది.

2014లో పాణ్యం నుంచి గెలిచిన గౌరు చరిత.. 2019లో వైసీపీ టిక్కెట్‌ తనకు కాకుండా సీనియర్‌ నేత అయిన కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి ఇస్తారనే భావనతో ఎన్నికలకు రెండు నెలల ముందు ఫిబ్రవరిలో టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌ రెడ్డిని పక్కనపెట్టిన చంద్రబాబు 2019లో గౌరు చరితకు పాణ్యం టిక్కెట్‌ ఇచ్చారు. అవకాశవాద రాజకీయాలు చేయడం, ఓడిపోయిన వారిని పక్కనపెట్టటడం చంద్రబాబు రాజకీయ నైజానికి ఇదే నిదర్శనం. 11.647 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఏరాసు ప్రతాప్‌ రెడ్డిని పక్కనపెట్టి 2019లో చరితకు టిక్కెట్‌ ఇచ్చిన చంద్రబాబు.. 43,857 ఓట్ల తేడాతో ఓడిపోయిన చరితకు 2024లో టిక్కెట్‌ ఇస్తారా..? 

Also Read : గోరంట్ల రాజకీయ భవిష్యత్‌ ఇదే.. క్లారిటీ ఇచ్చిన సీనియర్‌ నేత