iDreamPost
android-app
ios-app

బ‌ర్గ‌ర్లు, ఫ్రైస్ తింటే మీ బాడీలో ఏమ‌వుతుందో తెలుసా? గంట‌లో మ‌ళ్లీ ఎందుకు ఆక‌లి వేస్తుంది?

  • Published Jul 02, 2022 | 7:26 PM Updated Updated Jul 02, 2022 | 7:27 PM
బ‌ర్గ‌ర్లు, ఫ్రైస్ తింటే మీ బాడీలో ఏమ‌వుతుందో తెలుసా? గంట‌లో మ‌ళ్లీ ఎందుకు ఆక‌లి వేస్తుంది?

ఫాస్ట్ ఫుడ్ రెగ్యుల‌ర్ గా తిన‌డం మంచిదికాద‌ని చెప్ప‌డానికి మీరు ఎక్స్ ప‌ర్ట్ అయి ఉండ‌న‌క్క‌ర్లేదు. రోజూ తినేవాళ్ల బాడీని చూస్తే చాలు తెలిసిపోతుంది. మెక్ డొనాల్డ్స్ అంటే అందరికీ ఇష్ట‌మే. బ‌ర్గ‌ర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇష్ట‌మైన తిండి. బ‌ర్గ‌ర్ కింగ్ కానీయండి, మ‌రే ఇత‌ర ఫాస్ట్ ఫుడ్ వెరైటీస్ అయినా కానీయండి, వాటిని తిన్నత‌ర్వాత మ‌న‌లో ఏం జ‌రుగుతుంది? మితంగా తింటే స‌రిపోతుందా?

మ‌నం ఒక బిగ్ బ‌ర్గ‌ర్, మీడియం ఫ్రెంచ్ ఫ్రైస్ తిని, ఒక మిల్ షేక్ కాదంటే కూల్ డ్రింగ్ తాగేమ‌నుకోండి. తిన్నత‌ర్వాత ఏమ‌వుతుంది? ఎంత ఎన‌ర్జీ వ‌స్తుంది? ఎంత క్యాల‌రీలు చేరుతాయి? డైటీషియ‌న్లు చెప్పేదేంటి? తిన్న‌వెంట‌నే పొట్ట నిండుగా అనిపిస్తుంది. నోటికి రుచితెలుస్తుంది కాబ‌ట్టి, మ‌నం హ్యాపీ. అక్క‌డి వ‌ర‌కు ఓకే. ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంది? డైటీషియ‌న్లు ఏం చెబుతున్నారు?


15 నిమ‌షాలు
మీరు మెక్ మీల్ కాని, ఇంకేదైనా బ‌ర్గ‌ర్, ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్న 15 నిమ‌షాల త‌ర్వాత బ్ల‌డ్ షుగ‌ర్ లెవెల్స్ పెరుగుతాయి. మీరు ఎంత ఎక్కువ తింటే అంతగా షుగ‌ర్ పెరుగుతుంది. మీరు తిన్న కార్బ్స్ వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ చాలా తొంద‌ర‌గా రియాక్ట్ అవుతుంది. ఒక‌వేళ మీరు రెగ్యుల‌ర్ బ‌ర్గ‌ర్లు, ఫ్రెంచ్ ఫ్రైతింటే, కొన్నేళ్ల‌లో మీకు ఒబ‌సిటీ పెరుగుతంది. డ‌యాబిటీస్ వస్తుంది.

బ‌ర్గ‌ర్ తింటే అందులో వున్న స‌లాడ్ వ‌ల్ల 8గ్రాముల ఫైబ‌ర్ వ‌స్తుంది. బంగాళ‌దుంప‌, బ‌ర్గ‌ర్ బ‌న్ వ‌ల్ల కొంత ఫైబ‌ర్ వ‌స్తుంది. సాస్, చీజ్ వ‌ల్ల ఫ్యాట్, ప్రొటీన్ దొరుకుతాయి. కాని ఫ్రెంచ్ ఫ్రైను మాత్ర‌మే తింతే షుగ‌ర్ లెవెల్స్ అమాంతం పెరుగుతాయి. కాని వ‌చ్చే ఫైబర్, దొరికే ప్రొటీన్ క‌న్నా fat, saturated fat, sugar, caloriesతో మీకు ఎక్కువ న‌ష్టం.


20నిమ‌షాలు
ఇందులో ఉండే ఫాటీఫుడ్ వ‌ల్ల కొంద‌రిలో ఛాతీలో మంట. ఇది 20 నిమ‌షాల నుంచి గంట‌లోపు చాలామందికి తేనుపులు, హార్ట్ బ‌ర్న్ స‌మ‌స్య‌లొస్తాయి. కొన్నిసార్లు ఇది రెండుగంట‌ల వ‌ర‌కు వుంటుంది. అదే ప‌డుకొనేముందు మీరు క‌నుక బిగ్ బ‌ర్గ‌ర్ తింటే, నిద్ర‌క‌ష్టం.
30 నిమ‌షాలు
ఈ బ‌ర్గ‌ర్ల‌లో టేస్ట్ కోసం సాల్ట్ ఎక్కువ వేస్తారు. దాని వ‌ల్ల బ్లడ్ ప్ర‌జ‌ర్ పెరుగుతుంది. సాల్ట్ ఎక్కువ తీసుకొంటే కొంద‌రిలో వాట‌ర్ చేరుతుంది. క‌డుపు ఉబ్బుతుంది. పిప్ప‌ర బ‌స్తాలా క‌నిపిస్తారు. ఇదంతా కిడ్నీల ప‌ని. మీరు ఎక్కువ సాల్ట్ తీసుకొంటే బాడీలో స‌మ‌తుల్య‌త కోసం, కిడ్నీలు ఎక్కువ వాట‌ర్ ని స్టోర్ చేస్తాయి. ఎంత ఎక్కువ ఉప్పు తింటే, అంత ఎక్కువ వాట‌ర్ బాడీలో నిల్వ అవుతుంది. అప్పుడు మీరు బరువుకూడా పెరుగుతారు.
50నిమ‌షాలు
మీరు బ‌ర్గ‌ర్లు, ఫ్రైస్ తిన్న గంట‌లో మీకు సుగ‌ర్ లెవెల్స్ పెరిగితే , మీకు అల‌సట వ‌స్తుంది. మీరు తిన్నవాటిలో ఫైబ‌ర్, ప్రొటీన్ లేదంటే ఫ్యాట్ క‌నుక త‌క్కువైతే, మీరు బాగా అల‌సిపోయిన ఫీలింగ్ వ‌స్తుంది.
మీలో షుగ‌ర్ పెరిగితే, దాన్ని కంట్రోల్ చేయ‌డం కోసం పాంక్రియాస్ ఎక్కువ insulinను ప్రొడ్యూస్ చేస్తుంది. దానివ‌ల్ల ఫోక‌స్ తగ్గుతుంది. బాడీ అంతా గ‌జిబిజి. లంచ్ టైంలో మీరుక‌నుక బ‌ర్గ‌ర్లు, ఫ్రై తింటే… అంతే సంగ‌తులు. ఆఫీసులో ఉన్నా ఏం ప‌నిచేయ‌లేరు.
గంట త‌ర్వాత‌ insulin ఉత్ప‌త్తిని త‌ట్టుకోవ‌డానికి బాడీ ఎక్కువ ఎన‌ర్జీని కోరుకొంటుంది. అంటే మ‌ళ్లీ ఆక‌లి! అంటే బ‌ర్గ‌ర్, ఫ్రై తింటే తొంద‌ర‌గా బ్ల‌డ్ లో షుగ‌ర్ లెవెల్స్ పెరిగి, చివ‌ర‌కు మ‌ళ్లీ ఆక‌లి వేస్తుంది. మ‌ళ్లీ తింటే…గంట త‌ర్వాత అల‌స‌ట‌…ఆక‌లి. రోజూ తింటే..రోజూ ఇంతే.
అలాగ‌ని మీరు కంట్రోల్ చేసుకోలేరు. కార‌ణం, బ‌ర్గ‌ర్, ఫ్రెండ్ ప్రైస్ అంటే చాలా టేస్టీ ఫుడ్. నిండా షేగ‌ర్, ఫ్యాట్. వీటిని తింటే ఇలాంటి ఫుడ్ కావాల‌ని మైండ్ కి సిగ్న‌ల్స్ పంపిస్తుంది. తిన్న గంట త‌ర్వాత ఎలాగూ ఆక‌లివేస్తుంది. అదే మీరు రెగ్యుల‌ర్ గా తింటే?