iDreamPost
android-app
ios-app

సంప‌ద‌ను సృష్టిస్తున్న ప్ర‌భుత్వ సంక్షేమం

సంప‌ద‌ను సృష్టిస్తున్న ప్ర‌భుత్వ సంక్షేమం

సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌ను సోమ‌రుల‌ను చేస్తాయ‌నే వాద‌న ఉంది. కానీ, ఏపీని ప‌రిశీలిస్తే ఆ వాద‌న త‌ప్పేమో అనిపించ‌క మాన‌దు. సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో సంక్షేమ పాల‌న ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. క‌రోనా, లాక్ డౌన్ వంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా జ‌గ‌న్ త‌న సంక్షేమ ప‌థ‌కాల‌ను కొన‌సాగించారు. ప్ర‌జ‌ల ఖాతాల్లో నేరుగా న‌గ‌దు బదిలీ చేశారు. ఫ‌లితంగా క‌రోనా కాలంలో కూడా ఏపీలో ఉత్ప‌త్తి, వినిమ‌యంలో పెద్ద‌గా తేడాలు రాలేదు. క్ర‌య విక్ర‌యాలు బాగానే కొన‌సాగాయి. అంతేకాదు.. సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల‌ కొన్ని రంగాలలో గ‌ణ‌నీయ‌మైన వృద్ధి క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధి పొందిన వారు ప‌లు రంగాల్లో రాణిస్తూ సంప‌ద‌ను సృష్టిస్తున్నారు.

రాష్రంలో గుడ్లు, మాంసం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020–21 ఆర్థిక సంవత్సరంలో గుడ్ల ఉత్పత్తి 15 శాతం, మాంసం ఉత్పత్తి 11.76 శాతం పెరిగాయి. 2019–20లో 8.50 లక్షల మెట్రిక్‌ టన్నుల మాంసం ఉత్పత్తి కాగా 2020–21లో 9.54 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి అయిందని పశుసంవర్ధకశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 2019–20లో 2,170.77 కోట్ల గుడ్లు ఉత్పత్తి కాగా 2020–21లో 2,496.39 కోట్లు ఉత్పత్తి అయినట్లు అంచనా వేశారు. 2020–21లో 147.13 లక్షల మెట్రిక్‌ టన్నుల పాల ఉత్పత్తి జరిగినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఈ అంచనాలను రాష్ట్ర పశుసంవర్ధకశాఖ కేంద్రానికి పంపించింది. ఈ పెరుగుద‌ల‌కు ప్ర‌భుత్వం అందించిన‌ వైఎస్సార్ చేయూత కూడా ఓ కార‌ణమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ వెల్లువ

రాష్ట్రంలో మరింత పాలు, మాంసం ఉత్పత్తి పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు జీవనోపాధి మెరుగుపరచడం ద్వారా ఆర్థికంగా వారి కాళ్లమీద వారే నిలబడేలా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత ద్వారా ఆర్థికసాయం అందించింది. వారు కోరుకున్న మేరకు పాడి పశువులు, మేకలు, గొర్రెలు కూడా సమకూర్చేందుకు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయిస్తోంది. వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులకు జగనన్న పాలవెల్లువ కింద 1,12,008 యూనిట్లను అందజేయాలని, అలాగే జగనన్న జీవక్రాంతి ద్వారా 72,179 యూనిట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 70 శాతం మేర యూనిట్లకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. ప్ర‌భుత్వ స‌హ‌కారంతో ల‌బ్ధిదారులు క‌ష్ట‌ప‌డుతూ ఆ రంగంలో అభివృద్ధిని సాధిస్తున్నారు.

మరోపక్క తాజా గణాంకాల మేరకు రాష్ట్రంలో మొత్తం 3,40,68,177 పశుసంపద ఉంది. ఇందులో అత్యధిక పశుసంపద అనంతపురం జిల్లాలో 66.06 లక్షలుండగా అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 14.44 లక్షలు ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న, మధ్యతరగతి రైతుల వద్ద ఎక్కువగా పశుసంపద ఉంది. కరువు పరిస్థితుల్లో ఆ రైతులకు ప్రధాన ఆదాయవనరు పశుసంపదే. రాష్ట్రంలో మొత్తం 46,00,087 ఆవులు ఉండగా 62,19,499 గేదెలున్నాయి. 1,76,26,971 గొర్రెలుండగా 55,22,133 మేకలు ఉన్నాయి. గతంతో పోలిస్తే రాష్ట్రంలో మేకలు, గొర్రెల సంపద గణనీయంగా పెరిగింది. గతంలో గొర్రెలు 135.60 లక్షలుంటే తాజా గణాంకాల ప్రకారం 176.26 లక్షలకు, మేకలు 44.96 లక్షల నుంచి 55.22 లక్షలకు పెరిగాయి. ప్ర‌భుత్వం రైతుభరోసా కేంద్రాల ద్వారా పాడి రైతులకు నాణ్యమైన పశువుల దాణాను సబ్సిడీపై సరఫరా చేయ‌డం, ఉపాధి హామీ పథకం కింద 20 వేల ఎకరాల్లో 150 కోట్ల రూపాయలతో పశుగ్రాసం పెంచేందుకు చర్యలను చేప‌ట్ట‌డం, చేయూత మహిళలకు జగనన్న పాలవెల్లువ, జగనన్న జీవక్రాంతి ద్వారా ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను రాష్ట్రం నుంచే సరఫరా చేయ‌డం ద్వారా రాష్ట్రం ఈ వృద్ది సాధించింది.

Also Read : కేంద్రం వదిలేసింది.. రాష్ట్రం భరోసా ఇచ్చింది

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabethttps://kercabiofarm.hu/