Krishna Kowshik
ఎండాకాలం ఇలా మొదలయ్యిందో లేదో.. అలా నీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటేశాయి. దీంతో తాగు నీరు లేక విలవిలలాడుతున్న దేశ వ్యాప్తంగా ప్రజలు. మొన్నటి వరకు బెంగళూరులో నీటి కష్టాలు బెంబేలు పెట్టించాయి.
ఎండాకాలం ఇలా మొదలయ్యిందో లేదో.. అలా నీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటేశాయి. దీంతో తాగు నీరు లేక విలవిలలాడుతున్న దేశ వ్యాప్తంగా ప్రజలు. మొన్నటి వరకు బెంగళూరులో నీటి కష్టాలు బెంబేలు పెట్టించాయి.
Krishna Kowshik
ఎండాకాలం ఇలా మొదలైందో లేదో నీటి కష్టాలు మొదలయ్యాయి. నగరాల్లో, పట్టణాల్లో నీళ్లు లేక ప్రజలు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు. ఇక గ్రామాల్లో, పల్లెల్లో సైతం బావులు, చెరువులు ఎండిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర నడుచుకుంటూ నీళ్లు తెచ్చుకున్నారు. అలాగే బెంగళూరు నగర వాసులు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారో కళ్లారా చూశాం. అక్కడ ట్యాంకులను కొని తెచ్చుకున్నారు. ఒక్కసారిగా అక్కడ నీటికి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు దేశ రాజధాని నగరి నీటికి కటకటలాడుతోంది. ఢిల్లీలో కనీస అవసరాలకు నీళ్లు లభించక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హర్యానా నుంచి యమునా నీటి విడుదల లేకపోవడం ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాయి.
దీంతో ఢిల్లీ జల్ బోర్డు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తుంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో నీటిని వృథా చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం దేశ రాజధానిలో నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకుంటుంది. నీటిని వృథా చేస్తూ పట్టుబడిన వ్యక్తులకు రూ. 2 వేల జరిమానా విధించింది. అలాగే పట్టుబడిన వ్యక్తులపై ఢిల్లీ ప్రభుత్వం బుధవారం రూ.2,000 జరిమానా విధించింది. కార్లను కడగడం, ట్యాంకులు ఓవర్ ఫ్లో చేయడం, నిర్మాణం కోసం గృహ నీటి సరఫరాను ఉపయోగించడం వంటి వాటిని అరికట్టేందుకు గురువారం ఢిల్లీ అంతటా 200 బృందాలను నియమించాలని ఢిల్లీ మంత్రి అతిషి.. ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)ని కోరింది.
ఈ బృందాలు నివాస ప్రాంతాలను సందర్శించి తాగునీరు వృథా అవుతున్నాయో లేదో తనిఖీ చేస్తారు. పైప్‌లోని నీటితో కార్లను కడగడం, నీటి ట్యాంకులు పొంగిపొర్లడం, గృహావసరాల నీటి సరఫరా వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం, గృహ నిర్మాణ కోసం తాగునీటిని ఉపయోగించడం వంటి కార్యకలాపాలు వృధాగా పరిగణించబడతాయి. అలాంటి కార్యకలాపాలకు ₹ 2,000 జరిమానా విధించబడుతుంది. “కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరా లేదు, కాబట్టి మేము హేతుబద్ధీకరించాలి. రోజుకు రెండుసార్లు నీరు పొందే ప్రాంతాలకు ఇప్పుడు రోజుకు ఒకసారి అందుతుంది. దయచేసి ఈ కష్ట సమయంలో సహకరించండి. “దయచేసి నీటిని జాగ్రత్తగా వాడండి. దీన్ని అస్సలు వృధా చేయకండి, ” అని అతీషి నగర ప్రజలను కోరారు.