Dharani
Dharani
జియో సిమ్ వచ్చిన తర్వాత టెలికాం రంగంలో విపరీతమైన పోటీ పెరిగింది. జియో నుంచి ఆకర్షణీయమైన ఆఫర్స్ రావడంతో.. వినియోగదారులు అటు వైపు మొగ్గు చూపారు. దాంతో ఇతర టెలికాం కంపెనీలు కూడా దిగ రాక తప్పలేదు. ప్రస్తుతం అన్ని కంపెనీలు అన్‌లిమిటెడ్ టాక్ టైం, డేటా ఆఫర్తు ఇస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అలానే ఇతర కంపెనీల నుంచి వచ్చే పోటీ తట్టుకోవడానికి కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీనిలో భాగంగా ఓ టెలికాం కంపెనీ బంపరాఫర్ ప్రకటించింది. రూ.24కే అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్ ప్రకటించింది. ఆ వివరాలు..
తమ కస్టమర్ల కోసం ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా ఈ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్తగా రెండు డేటా ఓన్లీ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది వొడాఫోన్ ఐడియా. అవే రూ. 24, రూ. 49 ప్లాన్లు. గత కొద్ది సంవత్సరాలుగా వొడాఫోన్ ఐడియా భారీగా కస్టమర్లను కోల్పోతూ వస్తోంది. ప్రత్యర్థ కంపెనీలైనా భారతీ ఎయిర్‌టెల్, జియోల మాదిరిగా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్లు అందిస్తున్నప్పటికీ వాటితో పోటీపడలేకపోతుంది. తాజాగా ప్రకటించిన ఈ రెండ్లు ప్లాన్లతో రెవెన్యూ పర్ యూజర్ విషయంలో ఎంతో కొంత మార్పు వస్తుందని కంపెనీ భావిస్తోంది. దానికోసం తక్కువ మొత్తంలో అన్ లిమిటెడ్ డేటా ఆఫర్‌ని ప్రకటించింది వొడాఫోన్ ఐడియా.
వొడాఫోన్ ఐడియా తాజాగా తన కస్టమర్ల కోసం రూ. 24తో సూపర్ హవర్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు అన్‌లిమిటెడ్ డేటా లభిస్తోంది. అయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది. అంటే గంటలోపు మీరు ఎంత వీలైతే అంత డేటాను వినియోగించుకోవచ్చు అన్నమాట. సూపర్ హవర్ పేరుతో వొడాఫోన్ ఐడియా తెచ్చిన ఈ ప్లాన్.. ఎక్కువ డేటా కోసం చూసే కస్టమర్లకు ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. ఆఫర్ బాగానే ఉన్నా.. నెట్ వర్క్ సరిగా లేకపోవడం, 4జీ సేవల్లో అంతరాయం ఏర్పడుతుండటంతో.. ఈ ఆఫర్ కస్టమర్లను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
వొడాఫోన్ ఐడియా తీసుకువచ్చిన మరొక ప్లాన్ రూ.49 సూపర్ డే. వొడాఫోన్ ఐడియా సిమ్ వాడుతున్న వారికి ఈ సూపర్ డే ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా.. రూ. 49కే 6జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఒక రోజు ఉంటుంది. ఎక్కువ డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ ఎంతో ఉపయోగడపుతుందని చెప్పవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా 24 గంటల పాటు డేటా వినియోగించుకునే అవకాశం లభిస్తోంది. అయితే, వొడాఫోన్ ఐడియా తీసుకొచ్చిన ఈ వన్ హవర్ ప్లాన్, సూపర్ డే ప్లాన్ అనేవి కొత్తేవేమి కాదు. ఇంతకు ముందు అందుబాటులో ఉన్న ప్లాన్లే . వాటినే మళ్లీ తిరిగి ప్రవేశపెడుతోంది. మరి ఈ ఆఫర్లు కస్టమర్లను ఎంత వరకు ఆకర్షిస్తాయో చూడాలి.