iDreamPost
android-app
ios-app

పూర్ణానంద రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు.. అర్ధరాత్రి బాలికలను నిద్రలేపి..!

పూర్ణానంద రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు.. అర్ధరాత్రి బాలికలను నిద్రలేపి..!

భక్తి పేరిట లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో పూర్ణానంద స్వామి అరెస్టైన విషయం తెలిసిందే. ఆయన్ను కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం వచ్చేనెల 5వ తేదీ వరకు రిమాండు విధిచింది. పరిపూర్ణానంద ప్రస్తుతం సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈయనపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి. తాజగా పరిపూర్ణానంద రిమాండ్ రిపోర్ట్ మరింత సంచలనంగా మారింది. దిశ పోలీసులు రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను వెల్లడించారు. అర్ధరాత్రి బాలికలను తన గదికి తీసుకెళ్లేవారంటూ ప్రస్తావించారు.

పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం.. పూర్ణానంద ఆశ్రమంలో ముగ్గరు బాలికలు, 9 మంది బాలురు ఉన్నారు. బాలికలను అర్ధరాత్రి నిద్రలేపేవాడు. వారిని తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. ఒక బాలికపై ఏడాదిగా అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. పూర్ణానంద ఇద్దరు బాలికలపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా ఆధారాలు లభించాయని పోలీసులు వెల్లడించారు. బాలికలపై అఘాయిత్యం జరిగినట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదికలో కూడా వెల్లడైంది అన్నారు. బాలికలపై అత్యాచారం చేయడం మాత్రమే కాకుండా.. వారు గర్భం దాల్చకుండా ఉండేందుకు వారితో గర్భ నిరోధక మాత్రలు మింగించేవారంటూ ఆరోపించారు. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో ఆమెను బంధవులు ఆశ్రమం నుంచి తీసుకు వెళ్లిపోయారంటూ తెలిపారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoon girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş