iDreamPost
android-app
ios-app

రాజమౌళికి వైరస్ షాక్ : ఫ్లాష్ న్యూస్

రాజమౌళికి వైరస్ షాక్ : ఫ్లాష్ న్యూస్

భయపడినంతా అయ్యింది. ఇప్పటిదాకా టీవీ క్రూలో కొందరికే పరిమితమైన కరోనా మహమ్మారి ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలను తాకింది. తాజాగా రాజమౌళి దీని బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ధృవీకరిస్తూ ట్వీట్ చేయడం విశేషం. అయితే ఇక్కడ ఊరట చెందాల్సిన విషయం మరొకటుంది. జక్కన్న ఫ్యామిలీకి వచ్చింది మైల్డ్ కరోనానే. అంటే పెద్దగా ఖంగారు పడాల్సింది ఏమి లేదు. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ హోం క్వారెంటైన్ లో జాగ్రత్తలు తీసుకుంటే చాలు. రెండు మూడు వారాల్లో తగ్గిపోతుంది. కాకపోతే సింప్టమ్స్ ఎక్కువగా లేవని రాజమౌళి చెప్పడం ఊరట కలిగిస్తోంది. యాంటీ బాడీస్ వృద్ధి చేసుకునే పనిలో ఉన్నామని త్వరలో కోలుకుని ప్లాస్మా దానం చేసేందుకు ఎదురు చూస్తున్నామని చెప్పడం మెచ్చుకోవాల్సిన విషయం.

ఇప్పుడీ టాపిక్ సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా పేరున్న తెలుగు సినిమా ప్రముఖులు ఎవరూ కరోన బారిన పడలేదు. అందరూ సాధ్యమైనంత ఇళ్ళల్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. రాజమౌళి సైతం ఆర్ఆర్ఆర్ టెస్ట్ షూట్ చేద్దాం అనుకుని మళ్ళీ డ్రాప్ అయ్యారు. ఒకరకంగా అదే మంచి చేసిందని చెప్పాలి. లేకపోతే ఇంకా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారా అని ఎదురు చూస్తున్న టైంలో ఇలాంటి వార్త షాక్ కలిగించేదే. రాజమౌళి కోలుకోవడం ఖాయమే కాని ఇప్పుడు ఈ ఘటన ప్రభావం ఇతర షూటింగులను ఆలస్యం చేయడంలో ప్రభావం చూపించడం ఖాయం.

కాకతాళీయంగా రేపు ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్. అంటే మొదటి ప్రెస్ మీట్ లో అధికారికంగా ప్రకటించిన తేదీ. తర్వాత మార్చారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా పాత డేట్ గురించి ఫ్యాన్స్ సరదాగా చర్చించుకుంటున్న సమయంలో రాజమౌళి ఈ బాంబు పేల్చడం గమనార్హం. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్, ఇక్కడ రాజమౌళి, తమిళ్ లో విశాల్ ఇలా ఒక్కొక్కరుగా దీని బారిన పడుతున్నా త్వరగా కోలుకుని అందరికీ స్ఫూర్తి కలిగించడం విశేషం. త్వరలో రాజమౌళి కరోనా నెగటివ్ రిజల్ట్ గురించి షేర్ చేసుకుని ఆర్ఆర్ఆర్ గురించి పాజిటివ్ అప్ డేట్ ఇవ్వాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి