iDreamPost
android-app
ios-app

IND vs PAK: రోహిత్ బౌల్డ్.. కోహ్లీ షాకింగ్‌ రియాక్షన్! వీడియో వైరల్‌

  • Author Soma Sekhar Published - 07:24 PM, Sat - 2 September 23
  • Author Soma Sekhar Published - 07:24 PM, Sat - 2 September 23
IND vs PAK: రోహిత్ బౌల్డ్.. కోహ్లీ షాకింగ్‌ రియాక్షన్! వీడియో వైరల్‌

ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్ తో జరుగుతున్న తొలి మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ విఫలం కాగా.. యంగ్ బ్యాటర్లు గిల్, అయ్యర్ కూడా ఇదే బాటలో పయనించారు. కాగా.. ఈ మ్యాచ్ లో పాక్ పేస్ బౌలింగ్ దళం టీమిండియా టాపార్డర్ పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 22 బంతులు ఎదుర్కొని 11 పరుగులు చేయగా.. కింగ్ విరాట్ కోహ్లీ 7 బంతులు ఆడి కేవలం 4 రన్స్ మాత్రమే చేశాడు. వీరిద్దరు పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిదీకే వికెట్లు సమర్పించుకోవడం విశేషం. ఇక హిట్ మ్యాన్ అవుట్ కాగానే డగౌట్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

క్రికెట్ మ్యాచ్ లో విజయాల కంటే ఎక్కువగా అందులో చోటు చేసుకున్న సంఘటనలే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. తాజాగా పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. టీమిండియా సారథి బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 5వ ఓవర్ వేయడానికి వచ్చాడు పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ. ఈ ఓవర్ తొలి బంతికే రోహిత్ ను బౌల్డ్ చేశాడు. అద్భుతమైన ఇన్ స్వింగ్ ను అంచనా వేయడంలో రోహిత్ విఫలం అయ్యాడు. ఇక ఈ అవుట్ చూసిన విరాట్ కోహ్లీ.. డగౌట్ నుంచి ఇచ్చిన ఓ వింత రియాక్షన్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఇక రోహిత్ అవుట్ కావడంతో.. తల విదిలిస్తూ అసహనంతో పెవిలియన్ కు చేరాడు. పాక్ తో మ్యాచ్ అనగానే విరాట్, రోహిత్ చెలరేగుతారని క్రీడా పండితులు అందరూ చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. 64 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో టీమిండియాను ఇషాన్ కిషన్(82), హార్దిక్ పాండ్యా(80 బ్యాటింగ్) ఇద్దరు కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం టీమిండియా 40 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో హారీస్ రౌఫ్ 3, షాహీన్ అఫ్రిదీ 2 వికెట్లతో రాణించారు.


ఇదికూడా చదవండి: IND vs PAK: కోపంతో ఊగిపోయిన రోహిత్‌ శర్మ! వీడియో వైరల్‌