iDreamPost
android-app
ios-app

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అరుదైన దృశ్యం! 6 ఏళ్ల తర్వాత అలా చేసిన కోహ్లీ

  • Published Oct 19, 2023 | 4:10 PM Updated Updated Oct 19, 2023 | 4:10 PM
  • Published Oct 19, 2023 | 4:10 PMUpdated Oct 19, 2023 | 4:10 PM
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అరుదైన  దృశ్యం! 6 ఏళ్ల తర్వాత అలా చేసిన కోహ్లీ

క్రికెట్‌ అభిమానులకు కనుల పండగ అందించే దృశ్యాలు.. వన్డే వరల్డ్ కప్‌ 2023లో భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటుచేసుకున్నాయి. సాధారణంగా విరాట్‌ కోహ్లీ అంటేనే బ్యాటింగ్‌కి బ్రాండ్‌అంబాసిడర్‌. కానీ, అప్పుడప్పుడు బౌలింగ్‌ వేస్తాడు. కెరీర​ ఆరంభంలో కొన్నిసార్లు బాల్‌తో మెరిసిన కోహ్లీ.. బౌలింగ్‌ జోలికి వెళ్లి చాలా కాలం అయింది. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ బౌలర్‌ అవతారం ఎత్తాడు. అది కూడా వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌ కోహ్లీ బౌలింగ్‌ వేశాడు. దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ఖుష్‌ అవుతున్నారు.

అయితే.. కోహ్లీ పూర్తి ఓవర్‌ను వేయలేదు. కేవలం మూడు బంతులను మాత్రమే వేశాడే. టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్డిక్‌ పాండ్యా గాయంతో గ్రౌండ్‌ వీడటంతో విరాట్‌ బాల్‌ అందుకుని పాండ్యా ఓవర్‌ను పూర్తి చేశాడు. అసలు కోహ్లీ ఎందుకు బౌలింగ్‌ వేయాల్సి వచ్చిందంటే.. హార్డిక్‌ పాండ్యా ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ వేసేందుకు వచ్చాడు. అదే తనకు తొలి ఓవర్‌.. తొలి బంతి అద్భుతంగా వేసిన పాండ్యా.. తర్వాత రెండు బంతుల్లో రెండు ఫోర్లు సమర్పించుకున్నాడు. అయితే.. మూడో బంతిని బంగ్లాదేశ్‌ స్టార్‌ ఓపెనర్‌ లిటన్‌ దాస్‌.. స్ట్రేట్‌డ్రైవ్‌ ఆడాడు.

దాన్ని కాలితో ఆపేందుకు ప్రయత్నించిన పాండ్యా.. ఒక కాలిపై బ్యాలెన్స్‌ కోల్పోయి కిందపడ్డాడు. అయితే.. ఆ బాల్‌ ఆపే క్రమంలోనే పాండ్యా గాయపడ్డాడు. వెంటనే అతనికి చికిత్స అందించినా.. బౌలింగ్‌ చేసేందుకు పాండ్యా ఇబ్బంది పడుతుండటంతో.. మిగిలిన మూడు బంతులను పూర్తి చేసేందుకు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నుంచి విరాట్‌ కోహ్లీనే స్వయంగా బంతిని తీసుకున్నాడు. కాగా, ఆ మూడు బంతుల్లో కోహ్లీ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం. అంతకంటే ముందు పాండ్యా వేసిన మూడు బంతుల్లో 8 పరుగులు రాగా, కోహ్లీ కేవలం రెండు రన్స్‌ మాత్రం ఇచ్చి.. లాస్‌ను కాస్త కవర్‌ చేశాడు. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత కోహ్లీ బౌలింగ్‌ వేశాడు. కాగా కోహ్లీకి వన్డేల్లో 4 వికెట్ల కూడా ఉండటం విశేషం. మరి కోహ్లీ బౌలింగ్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Star Sports India (@starsportsindia)

ఇదీ చదవండి: World Cup: భారత్‌తో మ్యాచ్‌.. షకీబ్‌ అల్‌ హసన్‌ దూరం! కారణం ఏంటి?