iDreamPost
iDreamPost
పెళ్లన్నది కుటుంబాలకేకాదు, వాళ్ల ఫ్రెండ్స్ కూడా చాలా విలువైన అకేషన్. ఇక పెళ్లికొడుకు బరాత్ అంటారా? ఫ‌్యామిలీకి, క్లోజ్ ఫ్రెండ్స్ కు గొప్ప హంగామా. వేడుక. మరి పెళ్లికొడుకే బరాత్ లో ఫ్రెండ్స్ ను పట్టించుకోకపోతే? హరిద్వార్, బహదూరాబాద్ ప్రాంతంలో ఒక వింత సంఘటన జరిగింది. ఇది అతని ఫ్రెండ్స్ కు కోపం తెప్పింది. ఇదేమీ మందుకోసమో, విందుకోసమో కాదు.
వరుడు తన పెళ్లి రోజున , కార్డులో చెప్పిన టైం కన్నా ముందే, తన స్నేహితులను విడిచిపెట్టి బారత్‌తో వెళ్లిపోయాడు. ఫ్రెండ్ మ్యారేజ్ కదాని, ఎక్కడెక్కడి నుంచో రవి ఫ్రెండ్స్ వచ్చారు. బరాత్ తో ఆడిపాడదామనుకున్నారు. తీరా కార్డులో చెప్పిన సమయంకన్నా ముందే పెళ్లికొడుకు వెళ్లిపోతే, వచ్చిన ఫ్రెండ్స్ బిక్కముఖం వేశారు. పరువు పోయిందని ఫీలయ్యారు. అలాగని ఊరుకోలేదు. వరుడిపై రూ. 50 లక్షల పరువునష్టం దావా వేశారు.
అసలు ఏం జరిగిందంటే? పెళ్లికొడుకు రవి తన క్లోజ్ ఫ్రెండ్ ను పిలిచి, తన తరపున పెళ్లి కార్డులను ఇవ్వమని రిక్వెస్ట్ చేశాడు. ఆ స్నేహితుడు చంద్రశేఖర్, తానే కొందరికి సొంతంగా కార్డులిచ్చాడు. రవి వెంటతిరిగాడు. వెడ్డింగ్ కార్డ్‌లో పెళ్లి ఊరేగింపు 5 గంటలకు అని ఉంది. వెడ్డింగ్ కార్డ్‌లో చెప్పిన సమయానికి చంద్రశేఖర్, రవి స్నేహితులు అతని ఇంటికి వెళ్లారు. అప్పటికే బారాత్ వెళ్లిపోయింది.
చంద్రశేఖర్ వెంటనే రవిని కాల్ చేశాడు. పెళ్లి హడావిడిలో ఉన్న వరుడు, ఇప్పటికే లేట్ అయిపోయింది, మీరు ఇంటికి వెళ్లిపోమ్మని చెప్పేసరికి, చంద్రశేఖర్‌కి చిర్రెత్తుకొచ్చింది. రవి తరపు బంధువులు మానసికంగా హింసించారని, రవివల్ల తమకు పరువు పోయిందని కోర్టుకెళ్లారు. రవిపై రూ.50 లక్షల పరువునష్టం కేసు వేశారు. అంతేకాదు, మూడు రోజుల్లోగా రవి తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నది వాళ్ల డిమాండ్.