iDreamPost
android-app
ios-app

దేవుడికి ఉత్తరాలు రాస్తున్న గ్రామస్తులు.. న్యాయం చేస్తున్న దైవం!

దేవుడికి ఉత్తరాలు రాస్తున్న గ్రామస్తులు.. న్యాయం చేస్తున్న దైవం!

సాధారణంగా ఉత్తరాలను సమచారం పంపించేందుకు వినియోగిస్తుంటారు. పూర్వ ఉత్తరాలను ఎక్కువగా వినియోగించే వారు. బంధవులకు, ఉద్యోగాల దరఖాస్తులకు, ఇతర ప్రభుత్వ అంశాలకు, ఏదైన సమస్యల పరిష్కరాలకు లేఖలను ఉపయోగించే వారు. ఇప్పటి కూడా ఉత్తరాలు రాయడం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే ఉత్తరాల విషయంలో కూడా ఓ ప్రాంతం వార్తల్లో నిలిచింది. మరి.. ఉత్తరాలతో వార్తలోకి ఎక్కడం ఏంటని మీరు సందేహ పడుతున్నారా?. అయితే అసలు స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దేవుళ్లకు కొబ్బరి కాయాలు కొట్టి పూజలు చేయడం సర్వసాధారణం. అలానే సమస్యలు తీర్చమని దేవుళ్లను వేడుకుని హుండీలో డబ్బులు వేస్తుంటాము. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రం అల్మోడా జిల్లాలో భవాలీ పట్టణం ప్రాంతంలోని గ్రామాల ప్రజలు మాత్రం దేవుడికి ఉత్తరం రాస్తుంటారు. అలానే ఆ దేవుడుకు కూడా వారికి న్యాయం చేస్తున్నారంట. భవాలీ టౌన్ ప్రాంతంలో చితయీ గోలూ దేవ్ తా గుడి ఉంది. స్థానికంగా ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే నిత్యం ఇక్కడి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే ఇక్కడ ఆచారాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

సాధారణంగా ఎవరమైన దేవుడి ముందు సమస్యను మాటలతో వ్యక్తం చేస్తాము. అయితే ఇక్కడ ప్రజలు మాత్రం వెరైటీగా దేవుడికి తమ సమస్యలను తెలియజేస్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ సమస్యలను ఉత్తరాలుగా రాసి దేవుడికి సమర్పిస్తారు. పూజలు చేసిన తర్వాత తమ లేఖలను ఆలయం ఆవరణలో కడతారు. భక్తులు.. తాము కోరుకున్న కోరికలు నెరవేరినప్పుడు మళ్లీ వచ్చి గంటలు గడతారు. అలా ఈ ఆలయంలో ఉత్తరాలు రాస్తే న్యాయం జరుగుతుందంటున్నారు భక్తులు. మరి.. ఉత్తరాలు రాస్తే న్యాయం చేస్తున్న ఈ దైవం గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.