iDreamPost
iDreamPost
ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేసుకున్నప్పటికీ తెలుగులో పెద్దగా ఆంచనాలు లేకుండా విడుదలైన విక్రాంత్ రోనా మొదటి వీకెండ్ కే లాభాల బాట పట్టేసింది. అలా అని ఇదేదో విక్రమ్ రేంజ్ లోనో మేజర్ తరహాలో కలెక్షన్ల వర్షం కురిపించడం వల్ల కాదు. థియేట్రికల్ బిజినెస్ చాలా తక్కువకు చేయడంతో పాటు రామారావు ఆన్ డ్యూటీ డిజాస్టర్ టాక్ సుదీప్ కి కలిసి వచ్చింది. ఉన్నవాటిలో ఇదే బెస్టనే ఫీలింగ్ కలగడంతో ఆడియన్స్ విక్రాంత్ కే ఓటేస్తున్నారు. కాకపోతే ఈ దూకుడు వీకెండ్లో కనిపించినంతగా మిగిలిన రోజుల్లో కొనసాగే అవకాశాలు తక్కువ. ఈ శుక్రవారం బింబిసార, సీత రామం వచ్చేలోపు విక్రాంత్ రాబట్టుకునేదంతా లాభమే అవుతుంది.
ట్రేడ్ నుంచి అందిన రిపోర్ట్ మేరకు విక్రాంత్ రోనా తెలుగు రాష్ట్రాలు రెండు కలిపి 2 కోట్ల 90 లక్షల దాకా షేర్ సాధించింది. దీనికి జరిగిన బిజినెస్ కేవలం 1 కోటి 25 లక్షలు మాత్రమే. అందుకే పెట్టుబడి రాబడిలో ఇంత వ్యత్యాసం కనపడి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కురుస్తున్నాయి. ఒకవేళ అయిదారు కోట్లకు ఇచ్చి ఉంటే సీన్ వేరేలా ఉంది. హిందీ బెల్ట్ లో ఏక్ విలన్ రిటర్న్స్ తీవ్రంగా నిరాశపరచడం సుదీప్ మూవీకి చాలా ప్లస్ అవుతోంది. ఆగస్ట్ 11న లాల్ సింగ్ చడ్డా వచ్చే వరకు ఇంకే కాంపిటీషన్ లేకపోవడంతో విక్రాంత్ కు అడ్డుకట్ట వేయడం కష్టం. అయితే విక్రమ్ రేంజ్ లో రికార్డులు మాత్రం సాధ్యం కాకపోవచ్చు. యునానిమస్ టాక్ వచ్చి ఉంటే వేరే ఉండేది
నైజామ్ 1 కోటి 16 లక్షలు,సీడెడ్ 38 లక్షలు, ఉత్తరాంధ్ర 36 లక్షలు, ఈస్ట్ వెస్ట్ గోదావరి కలిపి 40 లక్షలు, గుంటూరు 26 లక్షలు, కృష్ణా 22 లక్షలు, నెల్లూరు 12 లక్షలతో కలిపి మొత్తం 2 కోట్ల 90 లక్షలు వచ్చింది. గ్రాస్ లో చూసుకుంటే ఇది 5 కోట్ల 78 లక్షల దాకా తేలుతుంది. సుదీప్ ఇమేజ్ కి ఇది చాలా పెద్ద మొత్తం. దీన్నుంచి ఒక విషయాన్నీ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సినిమా కనక రీజనబుల్ రేట్లకు అమ్మితే లాభాలు పెరిగే అవకాశాలు ఎలా ఉంటాయో స్పష్టంగా కనిపిస్తోంది. అలా కాకుండా అత్యాశ పోవడం వల్ల టికెట్ రేట్లు పెంచేసి తద్వారా ఆ భారాన్ని జనాల మీదకు నెట్టాల్సి వస్తోంది. ఇకనైనా ఈ సూత్రాన్ని సరిగా వంటబట్టించుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి.