Krishna Kowshik
Kiccha Sudeep: శాండల్ వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. కూతురు అంటే చిన్న పిల్ల అనుకున్నారేమో.. హీరోయిన్‌కి ఏమాత్రం తీసిపోనీ..
Kiccha Sudeep: శాండల్ వుడ్ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. కూతురు అంటే చిన్న పిల్ల అనుకున్నారేమో.. హీరోయిన్‌కి ఏమాత్రం తీసిపోనీ..
Krishna Kowshik
శాండల్ వుడ్ స్టార్ హీరోల్లో ఒకరు కిచ్చా సుదీప్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కేవలం నటుడు మాత్రమే కాదు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, టెలివిజన్ హోస్ట్, సింగర్ కూడా. ఇండియన్ 100 సెలబ్రిటీల్లో ఆయన పేరు కచ్చితంగా ఉంటుంది. సపోర్టింగ్ రోల్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ నటుడు.. ఇప్పుడు కన్నడ బాక్సాఫీసును శాసిస్తున్నాడు. 1997 నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇప్పటికీ అదే యంగ్ అండ్ ఎనర్జటిక్ ఫెర్మామెన్స్‌తో మెస్మరైజ్ చేస్తుంటాడు. ప్రియా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు ఉంది. కూతురు అంటే పది, పదిహేనేళ్ల కూతరు అనుకునేరూ.. ఆయనకు 20 ఏళ్ల కూతురుంది. ఏంటీ సుదీప్‌కు ఇంత పెద్ద కూతురుందా అంటే ఆశ్చర్యపోతున్నారు కదూ అవునండి.. ఆమె పేరు. శాన్వీ సుదీప్
సుదీప్, ప్రియా కూతురు శాన్వీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఆమె తండ్రిలాగా మంచి సింగర్ కూడా. కిచ్చా సుదీప్ మేనల్లుడు సంచిత్ సంజీవ్‌ను పరిచయం చేస్తూ ఓ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీకి అతడే దర్శకుడు. ఇందులో తన గళాన్ని వినిపించింది శాన్వీ. ఈ ఏడాది 20వ పడిలో పడిన ఈ బ్యూటీ చదువుతుందని సమాచారం. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన తల్లీదండ్రుల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆమెను చూస్తుంటే హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోదు. కానీ ఎడ్యుకేషన్ పై దృష్టి పెట్టడం వల్ల కేవలం సింగర్‌గా మాత్రమే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఆమె ఫోటోలు చూస్తే.. సుదీప్ వయస్సుపై చర్చించుకోవాల్సిందే. ఎందుకంటే.. ఆయనకు ఇప్పుడు 52. కానీ సుదీప్ ఇప్పటికీ అదే హ్యాండ్సమ్ లుక్స్‌లో కనిపిస్తూ ఉంటారు.
శివమొగ్గలో జన్మించిన సుదీప్.. ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆయనకు క్రికెట్ అంటే ఇష్టం. అండర్ 17కి ఆడాడు కూడా. ముంబయిలో యాక్టింగ్ కోర్సులో శిక్షణ తీసుకున్నాడు. 1997లో థయవ్వా అనే చిత్రంలో సపోర్టింగ్ రోల్ చేసిన దీపు.. కెరీర్ ప్లస్ అయిన మూవీ హుచ్చా. అక్కడ నుండి వెను తిరిగి చూసుకోలేదు. సుదీప్ పేరును సుదీపగా మార్చుకున్నాడు. కిచ్చ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన.. కిచ్చా సుదీపగా పిలుచుకోవడం స్టార్ట్ చేశారు అభిమానులు. అలాగే..తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేశాడు. తెలుగులో రామ్ గోపాల్ వర్మ.. రక్త చరిత్ర సిరీస్‌తో పాటు ఈగ మూవీ చేశాడు. ఇందులో నెగిటివ్ రోల్ చేసినప్పటికీ.. ఈయన చుట్టూనే కథ తిరుగుతుంది. తర్వాత సైరా నరసింహ రెడ్డిలోనూ నటించాడు. ప్రస్తుతం మ్యాక్స్‌తో పాటు పలు చిత్రాలు చేస్తున్నాడు. అలాగే బిగ్ బాస్ హోస్టుగా వ్యవహరిస్తున్నాడు.