iDreamPost
android-app
ios-app

హనుమాన్ మూవీపై నిర్మాత చైతన్య రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  • Published Jul 22, 2024 | 12:49 PM Updated Updated Jul 22, 2024 | 12:49 PM

Producer Chaitanya Reddy: ఈ ఏడాది సంక్రాంతి బరిలో స్టార్ హీరోలతో పోటీ పడి మరీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మూవీ ‘హనుమాన్’. చిన్న సినిమాగా రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది.

Producer Chaitanya Reddy: ఈ ఏడాది సంక్రాంతి బరిలో స్టార్ హీరోలతో పోటీ పడి మరీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న మూవీ ‘హనుమాన్’. చిన్న సినిమాగా రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది.

  • Published Jul 22, 2024 | 12:49 PMUpdated Jul 22, 2024 | 12:49 PM
హనుమాన్ మూవీపై నిర్మాత చైతన్య రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్వకత్వంలో తేజ సజ్జా, అమృతా అయ్యార్ జంటగా నటించిన చిత్రం ‘హనుమాన్’. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నాగార్జున నటించిన ‘నాసామి రంగ’, విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సైంధవ్’, మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ మూవీస్ తో పోటీ పడి రిలీజ్ అయ్యింది తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’. రిలీజ్ అయిన మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ప్రపంచ వ్యాప్తంగా సునామీ సృష్టించింది. జనవరి 12న రిలీజ్ అయిన ‘హనుమాన్’ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయి కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ షేక్ చేసింది. తాజాగా హనుమాన్ మూవీపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..

ఈ ఏడాది సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది ‘హనుమన్’. ఈ మూవీ ఎవరూ ఊహించని విధంగా ప్రపంచ వ్యాప్తంగా 237 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, ఓవర్సీస్ లో 57 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొత్తానికి క్లోజింగ్ గ్రాస్ 294 కోట్లు రాబట్టి తెలుగు ఇండస్ట్రీలో టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. సంక్రాంతి బరిలో నిలిచిన స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి ప్రపంచ వ్యాప్తంగా కనీ వినీ లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు కాసుల వర్షం కురిపించింది. యంగ్ డైరెక్టర్, చిన్న హీరో.. కానీ రిజల్ట్ మాత్రం బ్లాక్ బ్లస్టర్. మొత్తానికి ఈ మూవీలో టీమ్ సభ్యులంతో చిత్ర విజయంపై సంబరాలు జరుపుకున్నారు. తాజాగా హనుమాన్ నిర్మాతల్లో ఒకరైన చైతన్య రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హనుమాన్ మూవీ గాము ట్రెమండస్ సక్సెస్ చూడగలిగాం.. ఈ మూవీ మా అందరికీ మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ ట్రెమండస్ లాభాలు మాత్రం చూడలేదు. గ్రాస్ వాల్యూస్ కి ప్రొడూసర్ కి వచ్చే వాల్యూస్ కి ఎంతో తేడా ఉంటుంది.. ఒక సినిమా 1000 కోట్ల గ్రాస్ రాబడితే నిర్మాతకు ఎంత మిగులుతుందో ఆ నిర్మాత, ఆ వివరాలు చూసే అకౌంటెంట్ కు మాత్రమే తెలుస్తుందేమో.. బహుషా అది ట్రేడ్ సీక్రేట్ అనుకుంటా’ అని అన్నారు. ఈ ఏడాది చిన్న సినిమాల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన హనుమాన్ మూవీ కలెక్షన్లపై నిర్మాత చైతన్య రెడ్డి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.