iDreamPost
android-app
ios-app

‘దేవర’ వసూళ్ల ప్రభంజనం.. రెండో రోజు అదే జోరు..

  • Published Sep 29, 2024 | 11:19 AM Updated Updated Sep 29, 2024 | 4:58 PM

NTR Devara Movie: సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా దేవర ఫీవర్ పట్టుకుంది. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడంతో వసూళ్ల వర్షం కురుస్తుంది.

NTR Devara Movie: సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా దేవర ఫీవర్ పట్టుకుంది. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి పాజిటీవ్ టాక్ తెచ్చుకోవడంతో వసూళ్ల వర్షం కురుస్తుంది.

  • Published Sep 29, 2024 | 11:19 AMUpdated Sep 29, 2024 | 4:58 PM
‘దేవర’ వసూళ్ల ప్రభంజనం.. రెండో రోజు అదే జోరు..

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ రెండో రోజు అదే జోరు కొనసాగిస్తుంది. ఎన్టీఆర్ నుంచి ఆరేళ్ళ తర్వాత వచ్చిన సోలో మూవీ కావడంతో మొదటి నుంచి అంచనాలు బాగా పెరిగిపోయాయిన విషయం తెలిసిందే. దానికి తగ్గట్టుగానే రిలీజ్ అయిన అన్ని కేంద్రాల్లో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. కొరటాల శివ ‘ఆచార్య’ తర్వాత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘దేవర’ మొదటి షోతోనే బాక్సాఫీస్ షేక్ చేసింది. మొదటి రోజు రూ.172 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. రెండో రోజు కూడా అదే ప్రభావం చూపుతుంది. అన్ని ఏరియాల్లో కలిపి మంచి వసూల్ చేసిందని ఇండస్ట్రీ టాక్. పూర్తి వివరాల్లోకి వెళితే..

‘దేవర’ మూవీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఫస్ట్ డే, ఓపెనింగ్ డే కలెక్షన్లలో ‘ఆర్ఆర్ఆర్’ కన్నా ఎక్కువ షేర్ సాధించిన మూవీగా చరిత్రకు ఎక్కింది. అంతేకాదు సోలో హీరో‘ దేవర’ తో సెకండ్ హయ్యెస్ట్ షేర్ సాధించిన సినిమాగా దేవర రికార్డు తన పేరున రాసుకుంది. నైజాం లో రూ.44 కోట్లు, సీడెడ్ లో రూ.22 కోట్లు, ఆంధప్రదేశ్ లో రూ.46.55 కోట్ల బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.112.55 కోట్ల బిజినెస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.రెండు రోజులకే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ.16 కోట్లు షేర్ వసూలు చేసినట్లు ఇండస్ట్రీ టాక్. దేశంలో మిగిలిన ప్రాంతాల్లో మరో రూ.10 కోట్లు రాబట్టింది. రెండో రోజుకి మొత్తం రూ.26 కోట్ల షేర్ సాధించింది. బాలీవుడ్ లో ఫస్ట్ డే ర.7 కోట్ల నెట్ సాధించగా. రెండో రోజు రూ.10 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు సమాచారం. ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇదిలా ఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ.172 కోట్లు వసూలు చేస్తే.. రెండో రోజు రూ.243 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ ఎక్స్ వేధికగా అభిమానులతో పంచుకుంది.   ఈ రిజల్ట్ పై దేవర టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వీక్ ఎండ్ కనుక ఇంకాస్త ఎక్కువ టికెట్స్ బుకింగ్స్ అయినట్లు సమాచారం. ఇప్పటి వరకు తెలుగు దేవరకు ఏ మూవీ పోటీగా రాలేదు. తమిళ హీరోలు కార్తీ, అరవింద్ స్వామి నటించిన ‘సత్యం సుందరం’మూవీ రిలీజ్ అయినా పెద్ద ఇంపాక్ట్ పడలేదనే చెబుతున్నారు. పూర్తి యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘దేవర’ ఫ్యాన్స్ కి ఆరేళ్ళ దాహం తీర్చాడని తెగ సంబరాలు చేసుకుంటున్నారు. మరోసారి ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ ది మాసెస్ అని ప్రూవ్ చేసుకున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లాంట్ రన్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో ముందు ముందు చూడాలి. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సయిఫ్ అలీఖాన్, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, అజయ్ ముఖ్యపాత్రల్లో నటించారు. నందమూరి తారక రామారా ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై ఈ మూవీ నిర్మించారు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet