iDreamPost
android-app
ios-app

Vikram విక్రమ్ ముగింపు వసూళ్లు – లాభమెంత

  • Published Jul 04, 2022 | 12:28 PM Updated Updated Jul 04, 2022 | 12:28 PM
Vikram విక్రమ్ ముగింపు వసూళ్లు – లాభమెంత

లోకనాయకుడు కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ విక్రమ్ రన్ ముగింపుకు వచ్చింది. 8నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుండటంతో థియేటర్లలో ఇప్పటికే తగ్గిపోయిన ఆక్యుపెన్సీ దాదాపు జీరోకు చేరబోతోంది. పైగా రెగ్యులర్ గా కొత్త సినిమాలు వస్తున్న నేపథ్యంలో బిసి సెంటర్లలో ఆల్రెడీ తీసేశారు. అయినప్పటికీ విక్రమ్ డబుల్ ప్రాఫిట్స్ తో డిస్ట్రిబ్యూటర్లకు కనక వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లను సునాయాసంగా దాటేసిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తమిళనాడులో బాహుబలి 2ని దాటేసి నెంబర్ వన్ పొజిషన్ లో కూర్చుంది. విజయ్ అజిత్ రజనీకాంత్ వల్ల కానిది బ్యాడ్ టైంలో కమల్ సాధించి చూపడం అనూహ్యమైన పరిణామం.

తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే విక్రమ్ సుమారుగా 9 కోట్లకు పైగానే లాభాలు ఇచ్చి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి కామధేనువుగా మారింది. స్వంత బ్యానర్ లో బ్లాక్ బస్టర్ వచ్చి చాలా కాలమైన నేపథ్యంలో ఇప్పుడీ మూవీ ఇచ్చిన కిక్ మామూలుది కాదు. నేరుగా సంబంధం లేకపోయినా వచ్చే నెల విడుదల కాబోతున్న మాచర్ల నియోజకవర్గం బిజినెస్ కు ఇప్పుడీ ఫలితం ప్లస్ గా మారనుంది. ఏరియాల వారిగా చూసుకున్నా విక్రమ్ అన్నిచోట్లా వీరవిహారం చేసింది. రీజనబుల్ రేట్లకు అమ్మడమే కాక టికెట్ రేట్ల విషయంలో అత్యాశకు పోకపోవడం విక్రమ్ ను కాపాడింది.లేకపోతే ఎక్కువ ధరలు పెట్టుంటే ఇంకోరకమైన ఫలితం వచ్చేది

నైజామ్ – 7 కోట్ల 10 లక్షలు
సీడెడ్ – 2 కోట్ల 22 లక్షలు
ఉత్తరాంధ్ర – 2 కోట్ల 40 లక్షలు
ఈస్ట్ గోదావరి – 1 కోటి 31 లక్షలు
వెస్ట్ గోదావరి – 86 లక్షలు
గుంటూరు – 1 కోటి 17 లక్షలు
కృష్ణా – 1 కోటి 40 లక్షలు
నెల్లూరు – 58 లక్షలు

ఏపి తెలంగాణ మొత్తం ఫైనల్ షేర్ – 17 కోట్లు

విక్రమ్ కు జరిగిన థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల 50 లక్షల దాకా ఉంది. అంటే 9 కోట్ల 40 లక్షల పైచిలుకు లాభం వచ్చిందన్న మాట. గత కొన్నేళ్లలో ఏ డబ్బింగ్ మూవీ ఈ స్థాయిలో డబుల్ మార్జిన్ తో ప్రాఫిట్ ఇచ్చిన దాఖలాలు లేవు. పెద్దన్న, పేట లాంటివి కనీసం పది కోట్లను కూడా చేరుకోలేక చతికిల పడ్డాయి. అలాంటిది విక్రమ్ ఈ స్థాయిలో రాబట్టడం అంటే రికార్డే. దీని వల్ల కమల్ నెక్స్ట్ చేయబోయే ఇండియన్ 2 పనులు త్వరలో వేగవంతం చేయబోతున్నారు. ఆగిపోయిన శభాష్ నాయుడుని తిరిగి కంటిన్యూ చేయబోతున్నారు. తన డ్రీం ప్రాజెక్ట్ మరుదనాయగంని పూర్తి చేసే ఆలోచన జరుగుతోంది. అంతే మరి ఒక సక్సెస్ ఇచ్చే కిక్ అలాంటిది.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş