iDreamPost
android-app
ios-app

తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్‌ వర్మకు ఆల్రేడీ పెళ్లయ్యిందా?

  • Published Jun 20, 2023 | 1:13 PM Updated Updated Jun 20, 2023 | 1:13 PM
  • Published Jun 20, 2023 | 1:13 PMUpdated Jun 20, 2023 | 1:13 PM
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్‌ వర్మకు ఆల్రేడీ పెళ్లయ్యిందా?

ప్రస్తుతం బీటౌన్‌, ఫిల్మ్‌ నగర్‌లో తమన్నా లవ్‌ మ్యాటర్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. తమన్నా, విజయ్‌ వర్మ ఇద్దరు ప్రేమించుకుంటున్నారని.. చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ డిన్నర్‌ డేట్‌లకు వెళ్లడం, వెకేషన్స్‌కి చెక్కేయడం.. మీడియా కంట పడింది. దాంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ జోరుగా వార్తలు వచ్చాయి. అయితే తమన్నా మాత్రం.. కొన్ని రోజుల వరకు ఈ వార్తలను ఖండించింది. తాము కేవలం స్నేహితులమే అని చెప్పింది. ఇలా చెప్తూనే సడెన్‌గా ఒక రోజు తాము ఇద్దరం ప్రేమలో ఉన్నామంటూ షాక్‌ ఇచ్చింది తమన్నా. దాంతో అసలు వీరిద్దరికి పరిచయం ఎక్కడ, ఎప్పుడు స్టార్ట్‌ అయ్యింది.. ఎవరు ముందుగా ప్రపోజ్‌ చేశారు.. పెళ్లి ఎప్పుడు అనే అంశాల గురించి ప్రస్తుతం జోరుగా చర్చించుకుంటున్నారు. ఇలా ఉండగానే.. తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అది ఏంటంటే.. తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్‌ వర్మకు ఆల్రేడీ పెళ్లి అయ్యింది అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది అంటే..

విజయవర్మకి ఆల్రెడీ పెళ్లయింది అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్తలకి బలం చేకూర్చేలా.. విజయ్‌ వర్మ.. ఆయన పక్కనే మరో హీరోయిన్‌ పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. దాంతో అందరు విజయ్‌వర్మకు ఆల్రేడీ పెళ్లి అయ్యిందా.. తమన్నా రెండో పెళ్లి వాడిని వివాహం చేసుకోబోతుందా.. మొన్న హన్సికా.. ఇప్పుడు తమన్నా.. వీళ్లకేమయ్యింది.. ఇలా పెళ్లైన వారిని వివాహం చేసుకుంటున్నారు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అంతేకాక విజయ్‌వర్మ వివాహం చేసుకున్న ఆ అమ్మాయి ఎవరు అని తెగ చర్చించుకుంటున్నారు.

అయితే ఇక్కడ ఓ తిరకాసు ఉంది. విజయ్‌ వర్మ పక్కన పెళ్లి దుస్తుల్లో ఉన్నది అలియా భట్‌. దాంతో అందరికి మ్యాటర్‌ అర్థం అయ్యింది. అంటే వీరిద్దరూ ఏదైనా యాడ్‌ షూటింగ్‌ కోసమో, లేక ఏదైనా సినిమాలో నటించే సన్నివేశమో.. అయ్యి ఉంటుంది అని కామెంట్స్‌ చేస్తున్నారు. అన్నట్టుగానే గతంలో ఓ చిత్రంలో అలియా భట్‌.. విజయ్‌కి భార్యగా నటించింది. అందుకే ఫిలిం మేకర్స్ ఆ టైంలో వీరిద్దరూ పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటోను తీశారు. ఆశ్చర్యం ఏంటంటే ఆ ఫోటోని చూసి విజయ్ తల్లి కూడా షాక్ అయిపోయిందట . ప్రెసెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap