iDreamPost
android-app
ios-app

వేగంగా పరిగెత్తుతున్న ఫైటర్

  • Published Feb 01, 2020 | 5:29 AM Updated Updated Feb 01, 2020 | 5:29 AM
  • Published Feb 01, 2020 | 5:29 AMUpdated Feb 01, 2020 | 5:29 AM
వేగంగా పరిగెత్తుతున్న ఫైటర్

సినిమా పరిశ్రమలో అతి వేగంగా సినిమాలు తీస్తాడని పేరున్న దర్శకుడు పూరి జగన్నాధ్ తన కొత్త మూవీని సైతం అదే వేగంతో పరుగులు పెట్టిస్తున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఫైటర్(వర్కింగ్ టైటిల్)ఫస్ట్ షెడ్యూల్ ని ముంబైలో పూర్తి చేసుకుని తిరిగి నగరానికి వచ్చేశారట. ఇంకా హీరోయిన్ ఫిక్స్ కాని ఈ ఫైటర్ కోసం జాన్వీ కపూర్ కోసం చాలా ప్రయత్నించినట్టుగా వార్తలు వచ్చాయి కాని అవేవి వర్క్ అవుట్ అవ్వలేదని బాలీవుడ్ టాక్.

హింది వెర్షన్ కోసం ఈ ప్రాజెక్ట్ లో కరణ్ జోహార్ కూడా భాగమయ్యాడు. మార్షల్ ఆర్ట్స్ నేపధ్యంలో సాగే ఈ ఫైటర్ లో టాప్ స్టాండర్డ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని ఇప్పటికే టాక్ ఉంది. జాన్వీ కుదిరే ఛాన్స్ లేదు కాబట్టి ఆ స్థానంలో అనన్య పాండే కన్ఫర్మ్ కావొచ్చని తెలిసింది. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాస్టింగ్ హిట్ తో పూరి మళ్ళి ట్రాక్ లోకి వచ్చేశాడు. గత కొన్నేళ్ళుగా కనీస స్థాయి సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న పూరికి ఇస్మార్ట్ ఇచ్చిన కిక్ మాములుది కాదు. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు.

ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారట. విజయ్ దేవరకొండ గీత గోవిందం తర్వాత ఆ స్థాయి బ్లాక్ బస్టర్ మళ్ళి అందుకోలేదు. నోటా, డియర్ కామ్రేడ్ ఫలితాలు మార్కెట్ మీద కొంత ప్రభావం చూపించాయి. వరల్డ్ ఫేమస్ లవర్ రిజల్ట్ ఇంకో రెండు వారాల్లో వచ్చేస్తుంది. ఈ నేపధ్యంలో పూరి సినిమా మీద చాలా ఆశలే ఉన్నాయి విజయ్ కు. హీరోని యారోగెంట్ గా చూపించడంలో తనదైన శైలిని చూపించే పూరి అదే తరహా బాడీ లాంగ్వేజ్ తో యూత్ ని ఆకట్టుకునే విజయ్ దేవరకొండ కాంబినేషన్ కాబట్టి ట్రేడ్ ని దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet