భగ్గుమంటున్న కూరగాయల ధరలు! ఇక సామాన్యుడు బతికేదెలా?

భగ్గుమంటున్న కూరగాయల ధరలు! ఇక సామాన్యుడు బతికేదెలా?

గత కొన్నిరోజులుగా నగరంలో చికెన్, కోడి గుడ్డు ధరలు పోటాపోటీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. దీంతో వీటిని కొనడం కన్నా కూరగాయలు కొని తినడం మేలు అనుకున్నారు. కానీ, ఇంతలో సామాన్య ప్రజలకు షాక్ ఇస్తూ.. ఒక్కసారిగా మార్కెట్ లో కూరగాయలు ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి.

గత కొన్నిరోజులుగా నగరంలో చికెన్, కోడి గుడ్డు ధరలు పోటాపోటీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. దీంతో వీటిని కొనడం కన్నా కూరగాయలు కొని తినడం మేలు అనుకున్నారు. కానీ, ఇంతలో సామాన్య ప్రజలకు షాక్ ఇస్తూ.. ఒక్కసారిగా మార్కెట్ లో కూరగాయలు ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి.

ప్రస్తుత కాలంలో సామాన్య ప్రజలకు ప్రతి విషయంలోనూ ఆందోళనకరంగా ఉంటుందనే చెప్పవచ్చు. ఎందుకంటే.. ఇప్పుడు దేశంలో నిత్యావసర సరుకుల దగ్గర నుంచి ఎలక్ట్రికల్ వస్తువులకు అన్నిటి మీద భారీగా ధరలు పెరిగిపోతూ..  మధ్య తరగతి కుటుంబాలకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో అసలు మార్కెట్ కి వెళ్లి ఏ వస్తువు కొనాలన్నా ప్రజలు భయపడిపోతున్నారు. ముఖ్యంగా పప్పు, నూనె, గ్యాస్, వంటి వాటిపై విపరీతంగా ధరలు పెరిగిపోతున్నాయి. ఇకపోతే మొన్నటి వరకు చికెన్, కోడి గుడ్డు ధరలు కొండెక్కి కూర్చున్న విషయం తెలిసిందే. అయితే భారీగా పెరిగిన ధరలపై ప్రజలు వాటిని కొనుగోలు చేయాలంటేనే ఆలోచించే పరిస్థితికి వచ్చింది. దీంతో వీటికన్నా కూరగాయలు తినడం మేలు అనుకున్నారు. కానీ, ఇంతలో సామాన్య ప్రజలకు షాక్ ఇస్తూ.. ఒక్కసారిగా మార్కెట్ లో కూరగాయలు ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి.

గత కొన్నిరోజులుగా నగరంలో చికెన్, కోడి గుడ్డు ధరలు పోటాపోటీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. దీంతో వీటిని కొనడం కన్నా కూరగాయలు కొని తినడం మేలు అనుకున్నారు. అలాగే మార్కెట్ లో కూడా చాలా చవకగా ఈ కూరగాయలు విక్రయించేవారు. కానీ, తాజాగా ఇప్పడుు హైదరాబాద్ నగరంలో చవకాగా లభించిన కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా వాటిలో టమాటా ధర మళ్లీ కొండెక్కి కూర్చుంది. ఈ క్రమంలోనే.. రైతు బజారులోని కిలో టమాటా ధర రూ. 30 వరకు దాటేసింది. ఇక సాధారణ మార్కెట్లలో అయితే వీటి ధర రూ. 50 నుంచి రూ. 60 వరకు పలుకుతోంది. అలాగే బీన్స్ అయితే ఏకంగా రూ. 200కు దాటేసింది. ఇక వీటితో పాటు బీరకాయ, సొరకాయ ధరలు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.

ఇక ఈ నేపథ్యంలోనే  రైతు బజార్లలో గుండుబీన్స్ కిలో రూ. 155 లు కాగా,  గింజ చిక్కుడు రూ. 85, పచ్చకాకరకాయ రూ. 55,  బెండకాయ రూ. 45, పచ్చిమిర్చి రూ. 50 వరకు ధరలు పలుకుతున్నాయి. ఇక సాధారణ మార్కెట్ లో  అయితే కేవలం ఒక చిన్న కొత్తిమీర కట్ట రూ.10కు  విక్రయిస్తున్నారు. అయితే సాధారణంగా హైదరాబాద్‌లోని హోల్‌సేల్ మార్కెట్లకు రోజుకు 5 వేల క్వింటాళ్ల కూరగాయలు వస్తేనే ధర అదుపులో ఉంటుంది. కానీ, ప్రస్తుతం రూ. 2800 టన్నులకు అటూ ఇటుగా వస్తున్నాయి.  అయితే మామూలుగా నగరానికి రోజుకు 3,300 టన్నుల కూరగాయాలు అవసరం. కానీ, ఇప్పుడు అనుకున్నంత మేర మార్కెట్లకు రాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. ఇకపోతే  వర్షాలు కురిసి కూరగాయల సాగు పెరిగితే కానీ ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు. మరి, హైదరాబాద్ నగరంలో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments