iDreamPost
android-app
ios-app

సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు ,రాజీనామా చేసిన ముఖ్యమంత్రి

సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు ,రాజీనామా చేసిన ముఖ్యమంత్రి

మరో ఏడాదిలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ కీ ఎన్నికలు ఉన్న సమయంలో మంగళవారం ఆ రాష్ట్ర సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఉదయం బిజెపి లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఉన్న సమయాన ఆయన నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ బేబీ రాణి మౌర్య కు తన రాజీనామా పత్రం అందించారు.

ఆ 10 మంది వల్లనే??

2017 లో జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మొత్తం 70 సీట్లు ఉన్న అసెంబ్లీలో ఏకంగా 57 సీట్లు సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. హిల్ స్టేట్ గా పిలిచే ఉత్తరాఖండ్లో సంప్రదాయ ఉత్తర బ్రాహ్మణ వర్గాల ప్రభావం ఎక్కువ. మొత్తం 1.01 కోట్ల ఉత్తరాఖండ్ జనాభాలో 20 శాతం వరకూ బ్రాహ్మణులు, 18.76 శాతం ఎస్సీ వర్గాలు ఉన్నాయి. రాజపుత్ (క్షత్రియ) వర్గానికి చెందిన త్రివేంద్ర సింగ్ రావత్ మీద గత కొంతకాలంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు పదిమంది బాహాటంగా తిరుగుబాటు ఎగరవేశారు. సీఎం పని తీరు ఏమాత్రం బాగాలేదని, పార్టీ నేతలను కలుపుకు వెళ్లడంలో ఆయన పూర్తిగా వెనుకబడ్డారని పదేపదే ఆయన తీరు మీద అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ముఖ్యంగా పార్టీ కు తెలియకుండా సీఎం rawat ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రధాన ఆరోపణ. ఇవి బహిరంగం కావడంతో ఇటీవల పార్టీ పెద్దలు దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టారు.

దూతలు వచ్చి నివేదిక!

ఉత్తరాఖండ్ వ్యవహారాలు రాను రాను బీజేపీకి తలవంపులు తెచ్చే అవకాశం ఉండడంతో ఇటీవల అధిష్టానం ఉత్తరాఖండ్ పరిస్థితులు పరిశీలించాలని పార్టీ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్, ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ లను ఉత్తరాఖండ్ పంపింది. దీనిపై వారు ఉత్తరాఖండ్లోని బీజేపీ నేతలతో విడతలవారీగా సమావేశమై పూర్తి వివరాలను సేకరించారు. సీఎం తీరు మీద పార్టీ పరిస్థితి మీద వీరు అధిష్టానానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రిని మార్చితే ఉత్తరాఖండ్ రాజకీయాలు మళ్ళీ బీజేపీ చేతికి వచ్చే అవకాశం ఉందని తేలడంతో పాటు, పార్టీలోని ఎక్కువమంది సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ ఒప్పుకోకపోవడంతో ఆయనను రాజీనామా చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది.

తివారి ఒక్కరే అయిదేళ్లు

2000 సంవత్సరం, నవంబర్ 9వ తేదీన ఆవిర్భవించిన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి పూర్తి కాలం సీఎం గా ఉన్నది ఒకే ఒక్కరు. కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహించిన నారాయణ్ దత్ తివారీ మాత్రమే ఐదేళ్లు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సీఎంగా కొనసాగారు. 2002 నుంచి 2007 వరకు పండితే వారి ఉత్తరాఖండ్ కొనసాగితే, హరీష్ రావత్ మూడుసార్లు సీఎం అయినా కేవలం రోజుల వ్యవధి మాత్రమే పని చేశారు. ప్రస్తుతం రాజీనామా చేసిన త్రివేంద్ర సింగ్ రావత్ సైతం మరికొద్ది రోజుల్లో నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్నారు అన్న సమయంలో రాజీనామా చేయడంతో ఆయన కూడా పూర్తి కాలం పదవిలో లేని వారి జాబితాలోకి చేరిపోయారు.

పార్టీ కోసమేనా??

సీఎం మీద వ్యతిరేకత రానురాను ఉత్తరాఖండ్లో పెరిగిపోతుండడంతో పాటు వ్యతిరేక వర్గం వ్యతిరేక వర్గం అధిష్టానానికి తలనొప్పిగా మారడంతో దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలని బిజెపి అధినాయకత్వం భావించింది. వచ్చే ఏడాది ఎన్నికల కు వెళ్లనున్న తరుణంలో ఇప్పటినుంచే పార్టీని గాడిలో పెడితే గాని మరోసారి ఉత్తరాఖండ్లో కాషాయ జెండా ఎగరడం కష్టం అని భావించిన అధిష్టాన పెద్దలు సిఎం మార్పు నకే మొగ్గుచూపారు. తదుపరి బీజేపీ అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుంది అన్న దానిమీద సస్పెన్స్ నెలకొంది. సీఎం పీఠానికి ఇప్పటికే ఐదు మంది పేర్లు వరకు వినిపిస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో పార్టీని గాడిలో పెట్టి ముందుకు నడిపించే నాయకుడికి అధిష్టానం ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Read Also : శశికళ త‌ప్పుకోవ‌డం లాభ‌మా, న‌ష్ట‌మా?