iDreamPost
android-app
ios-app

RTC బంపర్ ఆఫర్.. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణం..

RTC బంపర్ ఆఫర్.. టికెట్ లేకుండా బస్సులో ప్రయాణం..

ఆర్టీసీ అనేది సామాన్యుడి జీవితంలో అతి ప్రధానమైనది. ఈ సంస్థ ద్వారానే నిత్యం వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. అందుకే దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆర్టీసీ సంస్థ ఉంది. ఈ సంస్థలు ప్రయాణికుల సౌకర్యార్థం ఎప్పటికప్పుడు అనేక చర్యలు తీసుకుంటుంటారు. అలానే మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు, ఆఫర్లు తరచూ ప్రకటిస్తుంటారు. ఇటీవలే కర్నాటక ప్రభుత్వం మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అది కూడా రాఖీ పండగ సందర్భంగా ఆ కీలక నిర్ణయం తీసుకుంది. మరీ.. ఆ నిర్ణయం ఏంటి, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

రాఖీ పండుగ అంటేనే సోదరీ, సోదరీమణుల ప్రేమకు గుర్తుగా జరుపుకునే వేడుక. ఈ పండగను యావత్ భారత దేశం ఘనంగా జరుపుకుంటుంది. ఎక్కెడెక్కడో ఉన్న అన్నాదమ్ములకు, తమ అక్కాచెల్లెలు రాఖీలు కడుతుంటారు. మరికొందరు తమ సోదరుడికి రాఖీ కట్టేందుకు.. సొంత ఊర్లకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాఖీ పండుగ కానుకగా రాష్ట్ర మహిళలందరికీ ఉచిత ఆర్టీసీలో ప్రయాణం చేసేలా కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

ఆగస్టు 30 అర్థరాత్రి 12 గంటల నుంచి ఆగస్టు 31 అర్థరాత్రి 12 గంటల వరకు.. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. యూపీలోని మహిళలకు ఉచిత బస్ సర్వీస్ కల్పిస్తున్నట్లు జాయింట్ సెక్రటరీ కళ్యాణ్ బెనర్జీ తెలిపారు. అయితే రాఖీ పండగకు యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం కొత్తమేమి కాదు. గతేడాది కూడా  ఇలానే ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. తాజాగా గతేడాది మాదిరిగానే రక్షా బంధన్ సందర్భంగా ఈసారీ కూడా ఎస్‌పీవీ ద్వారా నడిచే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.

యోగి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో, కాన్పూర్, మీరట్, ప్రయాగ్‌రాజ్ జిల్లాలతో సహా రాష్ట్రంలోని 14 జిల్లాల్లో మహిళలకు సిటీ బస్సుల్లో ఉచిత సర్వీస్ లభిస్తుంది. దీంతో పాటు వారణాసి, ఘజియాబాద్, అలీగఢ్‌లోని మహిళలు ఉండే మహిలు సైతం అర్హులు. అంతేకాకుండా మొరాదాబాద్, ఝాన్సీ, బరేలీ, గోరఖ్‌పూర్, షాజహాన్‌పూర్, ఆగ్రా, మధుర-బృందావన్‌లోని సిటీ బస్సుల్లోనూ ప్రభుత్వ నిర్ణయం వర్తిస్తుంది. మరి.. యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో  తెలియజేయండి.

ఇదీ చదవండి: రాఖీ కట్టేందుకు సోదరుడు కావాలన్న కుమార్తె.. తల్లిదండ్రులు ఏం చేశారంటే..?