iDreamPost
android-app
ios-app

Puspa 2: నా గురువుకి నేను సాయం చేయడమేంటి? వైర‌ల్ పిక్ పై ఉప్పెన డైరెక్ట‌ర్ క్లారిటీ

  • Published Jul 29, 2022 | 3:39 PM Updated Updated Jul 29, 2022 | 3:39 PM
  • Published Jul 29, 2022 | 3:39 PMUpdated Jul 29, 2022 | 3:39 PM
Puspa 2: నా గురువుకి నేను సాయం చేయడమేంటి? వైర‌ల్ పిక్ పై ఉప్పెన డైరెక్ట‌ర్ క్లారిటీ

పుష్ప 2ను స‌రిగ్గా తీస్తే, కేజీఎఫ్ 2లా వెయ్యి కోట్లు కొట్ట‌వ‌చ్చ‌న్న అంచ‌నాల మ‌ధ్య కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ ఫొటొల్లో సుకుమార్, అత‌ని శిష్యుడు బుచ్చిబాబు స్క్రిప్ట్ డిస్కషన్ లో వున్న‌ట్లు అనిపించింది. పుష్ప 2 కోసం సుకుమార్‌, శిష్యుడు బుచ్చిబాబు సలహాలు తీసుకుంటున్నాడంటూ పుకార్లు వ‌చ్చాయి.

ఇద్ద‌రూ రెండు పెద్ద ప్రాజెక్ట్స్ మీద ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఇలాంటి రూమ‌ర్లు అంటే ఇద్ద‌రికీ ఇబ్బందే. అందుకే బుచ్చిబాబు స్పందించాడు. సుకుమార్ తో కలిసి దిగిన ఫొటో షేర్‌ చేస్తూ, ‘ఈ ఫొటో నేను తర్వాత చేయబోయే నా సినిమా కథ గురించి చర్చిస్తున్న సందర్భంలోది. మా గురువుగారు సుకుమార్‌ సర్‌ నా కోసం, నా సినిమా కథ కోసం సాయం చేయడానికి వచ్చారు. సుకుమార్‌ సర్‌ సినిమా కథలో కూర్చుని చర్చించేంత స్థాయి నాకు లేదు, రాదు. ఆయన నుంచి నేర్చుకోవడమే తప్ప ఆయనకు ఇచ్చేంత లేదు’ అని క్లారిటీ ఇచ్చాడు.


అస‌లు ఈ ఫోటోల‌ను బుచ్చిబాబు రిలీజ్ చేయ‌లేదు. తన మిత్రుడికి పంపితే, అత‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అవికాస్తా వైర‌ల్ అయ్యాయి. ఆ ఫొటోలను బ‌ట్టి, ఇంకా స్క్రిప్ట్ కాలేదా? పుష్ప‌2 లో ఏం జ‌రుగుతోంద‌న్న‌ క‌థ‌నాలు వ‌చ్చాయి. నిజానికి ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ మీద బుచ్చిబాబు ఉన్నాడు. ఆ సినిమా స్క్రిప్ట్ ను, సుకుమార్ కు పూర్తిగా నెరేషన్ ఇచ్చాడట ఉప్పెన డైరెక్ట‌ర్. రెండురోజులు ఆ నెరేష‌న్ విని సుకుమార్ సూచనలు ఇచ్చాడు. ఆ టైంలో తీసిన ఫోటోయే ఇది.

ఇక పుష్క 2 విష‌యానికొస్తే, స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. శ్రావణమాసంలో పూజ చేసి, హైదరాబాద్ చుట్టుప్ర‌క్క‌లే షూటింగ్ మొద‌లుపెట్ట‌నున్నారు. కాక‌పోతే షూటింగ్ ను ఆగస్టులో మొదలుపెట్టాలనుకున్నా, ఆగస్టు 1 నుంచి షూటింగ్స్‌ బంద్ కావ‌డంతో షూట్ మ‌రింత ఆల‌స్యం కానుంది.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş